ద‌స‌రా పండుగ‌ను ఎవ‌రు ఏ స్టైల్లో జ‌రుపుకుంటారో తెలుసా?

విజయనగరం సిరిమాను ఉత్స‌వం: విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లి’కి పూజలు చేస్తారు’. ఈ దేవికి దసరా వెళ్ళిన తరువాత మొదటి మంగళవారం నాడు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా అడవిలో నుండి ఒక నిటారైన చెట్టును నరికి తీసుకు వచ్చి మొదలు భాగాన్ని లాగుడు బండికి కట్టి చివరి భాగంలో ఊయలకట్టి అందులో పూజారిని కూర్చో పెట్టి ఊరేగింపుగా గుడినుండి కోటకు తీసుకు వస్తారు.

వీపన గండ్ల రాళ్ళయుద్దం: కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరాసమయంలో రాళ్ళయుద్ధం చేసుకుంటారు. దసరా రోజున సాయం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున కాలువకు అటూఇటూ చేరి కంకర రాళ్ళను గుట్టగా పోసుకుని ఒకవైపు రామసేన ఒకవైపు రావణ సేనగా ఊహించి రాళ్ళను విసురుతూ యుద్ధం చేసుకుంటారు.

దేవ‌ర‌గ‌ట్టు క‌ర్ర‌ల స‌మ‌రం: కర్నూలు జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో మాలమల్లేశ్వరస్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 18 గ్రామాల ప్రజలు, దేవరగట్టు నెలవై ఉన్న రెండుగ్రామాల పరిధిలోని ప్రజలతో కొట్లాడతారు. స్వామిని తీసుకువెళ్లేందుకు ఓ వర్గం, తమ గ్రామంలోనే ఉండేలా చూసుకునేందుకు మరో వర్గం ఎదురుపడి ఇనుప తొడుగులు తొడిగిన వెదురుకర్రలతో విపరీతంగా కొట్టుకుంటారు. ఎంత గాయాలైనా పట్టించుకోరు.

బందరు శక్తి పటాలు :కాళీమాత పటాన్ని విపుకు కట్టుకుని ముఖానికి అమ్మవారి భయంకర ముఖాకృతిని తగిలించుకుని నాట్యమాడుతూ వీధులలో తిరుగుతారు.పటం ధరించిన వారు డప్పు శబ్ధానికి అనుగుణంగా వీరనృత్యం చేస్తూ భయంకరాకృతిలో ఉన్న రాక్షసుని సంహరిస్తున్నట్లు అభినయిస్తారు.

మైసూరు: మైసూరు రాజా వారి కుటుంబానికి చెందిన వారు వారి కులదైవం అయిన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా వ‌స్తారు. ఆ సమయంలో వీధులలో అనేక కళా ప్రదర్శనలు చేప‌డ‌తారు. ఈక్ర‌మంలో వారి ఏనుగును అలంక‌రించే విధానం చాలా క‌ళాత్మ‌కంగా ఉంటుంది.

ఒడిషా: ఈ పండుగ సంధ‌ర్భంగా స్త్రీలు మానికలో వడ్లు నింపి లక్ష్మీ దేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు.దీనిని వారు మాన బాన అంటారు. అలా వ‌డ్ల రూపంలో ఉన్న అమ్మ‌వారిని పూజించ‌డం వ‌ల్ల సిరి సంప‌ద‌లు క‌లుగుతాయ‌ని వారి న‌మ్మ‌కం.

గుజరాత్ :ఇంటి గోడల మీద శ్రీ చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు.ఆ గుర్తుల ముందు పొలం మ‌ట్టి తెచ్చి ఆ దానిపై బార్లీ, గోధుమ విత్తనాలను చల్లి దానిపై మట్టి ఉండ పెట్టి దానిని నీటితో నింపి పోకచెక్క వెండి లేక రాగి నాణెం వేస్తారు. ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు.

Comments

comments

Share this post

scroll to top