చనిపోయిన మనిషిని బ్రతికిస్తాం అని క్షుద్ర పూజలు.!!

చనిపోయిన మనిషిని బ్రతికించడం సాధ్యమా.? అసలు ఆలా ఎక్కడైనా జరిగిందా.? నెల్లూరు జిల్లా వేంకటగిరి మండలం పెట్లురు గ్రామం లోని స్మశానంలో చనిపోయిన మనిషిని బ్రతికిస్తాం అని మాయ మాటలు చెప్పి క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. వివరాల్లోకెళితే.

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లురు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం మృతి చెందాడు. ఆ వ్యక్తిని బతికిస్తామని మృతుని కుటుంబసభ్యులను కొంతమంది వ్యక్తులు నమ్మించారు. ఇందుకోసం స్మశానంలో క్షుద్రపూజలు నిర్వహించాలని తెలిపారు. వారి మాటలు నమ్మిన మృతుని కుటుంబసభ్యులు క్షుద్ర పూజలు నిర్వహించేందుకు అంగీకరించారు.

రెండు వారాల నుంచి భూత వైద్యులు, మృతుని బంధువులు పెట్లురు గ్రామ స్మశానంలో తిష్టవేసి పూజలు నిర్వహించారు. ఈ విషయంపై గ్రామస్తులు బయపడి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ కాలం లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా.?

చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం అసాధ్యం, గుండె ఆగిన వెంటనే ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు, ఆ ఎలక్ట్రిక్ షాక్ వల్ల బ్రతికే వారి సంఖ్య తక్కువే, కానీ మనిషి చనిపోయాక స్మశానం లో పూడ్చి లేదా కాల్చేసాక ఆ మనిషిని తిరిగి బ్రతికించడం అనేది సాధ్యం కాని పని. చనిపోయిన వారి మీద మీకు ఉన్న ప్రేమ మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తుంది, అందుకే మళ్ళీ బ్రతికిస్తాం అని మాయ మాటలు చెప్పగానే నమ్మేస్తారు.

ముఖ్యంగా మన దేశం లో జనాలను మోసం చేసే వారి సంఖ్య ఎక్కువ. క్షుద్ర పూజలు, తంత్రాలు, మంత్రాలు అని చెప్పి జనాలను మోసం చేసే వారి సంఖ్య ఇంకా అధికం. పల్లెటూరి జనాలనే కాదు, పట్నం వాసులను కూడా మాటల్తో బురిడీ కొట్టి పైసల్ గుంజుకుంటారు ఈ బాబాలు. ఇకనైనా జాగ్రత్త వహించడం మంచిది. ఇకపైన అయినా ఇలాంటివి ఎవరూ చెయ్యకుండా ఉండాలి.

ఇటీవల హైదరాబాద్ లో క్షుద్ర పూజలు నిర్వహిస్తూ పోలీసులకి పట్టుబడ్డాడు ఒక వ్యక్తి. జనగాం జిల్లా, చిల్పూర్‌ మండలం, శ్రీపతిపల్లికి చెందిన గడ్డం శివకుమార్‌(26) చదువు మధ్యలో ఆపేసి క్షుద్రపూజలపట్ల ఆకర్షితుడయ్యాడు. ప్రధాన గురువైన ఈశ్వర్‌కోసీ, విజయవాడకు చెందిన మరో గురువు పణీంద్ర గడ్రకోటల వద్ద క్షుద్రపూజల విద్య నేర్చుకున్నాడు. తరచూ నాసిక్‌ వెళ్లి గురువులు, సాధువుల వద్ద ఆ విద్య అభ్యసించేవాడు. అసోంతోపాటు ఇతర రాష్ట్రాల్లో శ్మశానవాటికల్లో తాంత్రిక, క్షుద్రపూజలు చేసేవాడు. భస్మం పూజ అమావాస్య రోజుల్లో చేస్తుంటాడు. శివకుమార్‌ మకాంను నగరానికి మార్చాడు. మానసిక, ఇతర వ్యాధులను పూజలతో నయం చేస్తానని అమాయకులను నమ్మించేవాడు. ఒక్కో పూజకు రూ. 10 వేలు తీసుకునేవాడు. హెచ్‌బీ కాలనీ, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో పూజలు చేస్తున్నాడు. జిమ్మిగడ్డలో పూజలు చేస్తున్నాడని తెలుసుకున్న ఎస్‌వోటీ పోలీసులు దాడిచేసి అతడిని పట్టుకొన్నారు. పూజా సామగ్రి, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకొని జవహర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

Watch Video :

 

Comments

comments

Share this post

scroll to top