“ఎస్‌బీఐ” లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… మ‌న దేశంలో అత్యంత పాత‌దైన‌, పాపులారిటీ ఉన్న బ్యాంక్ ఇది. అంత పాపులారిటీ ఈ బ్యాంక్‌కు రావ‌డానికి కార‌ణం ప్ర‌జ‌ల న‌మ్మ‌క‌మే. అదే ఆ బ్యాంక్‌ను నిల‌బెడుతోంది. అయితే అడ‌పా ద‌డ‌పా ఈ బ్యాంక్ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. సోష‌ల్ మీడియాలో ఈ బ్యాంక్ గురించి, అందులోని ఎంప్లాయ్‌ల గురించి, ఇతర వాటి గురించి జోకులు వేస్తూ ట్రోల్ చేస్తూనే ఉంటారు. అయితే ఇదంతా.. స‌రే.. ఇప్పుడు మ‌ళ్లీ ఎస్‌బీఐ గురించిన ఏదైనా వార్త అలా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుందా ? అంటే.. ఉహు.. అది కాదు. ఇప్పుడు చెప్ప‌బోయేది వేరే విష‌యం. ఇంత‌కీ అదేమిటంటే…

మీరెప్పుడైనా ఎస్‌బీఐ లోగోను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించారా ? చాలా సార్లు దాన్ని చూసి ఉంటారు కానీ స‌రిగ్గా గ‌మ‌నించి ఉండ‌రు. అయితే స‌రే.. గ‌మ‌నించినా, గ‌మ‌నించ‌క‌పోయినా… ఇప్పుడు మాత్రం దాని అర్థం ఏమిటో, అస‌లు అలా లోగోను ఎందుకు డిజైన్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎస్‌బీఐ లోగో ఎందుకు అలాంటి డిజైన్‌లో ఉందో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ సోష‌ల్ మీడియాలో దీనిపై కొంద‌రు ప‌లు వివ‌రణ‌లు ఇచ్చారు. అవేమిటంటే… స‌ద‌రు ఎస్‌బీఐ లోగో లో ఉన్న నీలి రంగు వృత్తం ఏక‌త్వానికి చిహ్న‌మ‌ని అందులో ఉన్న తెలుపు రంగు పార్ట్ కామ‌న్ మ్యాన్‌కు సింబ‌ల్ అని కొంద‌రు చెప్పారు. ఇక ఈ లోగో డిజైన్ గురించి మ‌రికొంద‌రు ఎలా వివ‌రించారంటే… స‌ద‌రు బ్లూ స‌ర్కిల్‌లో ఉన్న‌ది కీ హోల్‌ను సూచిస్తుందని, అది సేఫ్టీకి, సెక్యూరిటీకి సింబ‌ల్ అని చెప్పారు. ఇక మ‌రికొంద‌రు ఆ లోగోను కంకారియా స‌ర‌స్సు ఉన్న ఆకృతిలా త‌యారు చేశార‌ని అన్నారు. అయితే ఇవేవీ స‌రైన‌వి కావు. చివ‌ర‌కు ఆ లోగోను డిజైన్ చేసిన శేఖ‌ర్ కామ‌త్ అస‌లు ఆ లోగో ఎలా త‌యారు చేశారో చెప్పారు.

ఎస్‌బీఐ లోగోను 1970వ సంవ‌త్స‌రంలో శేఖర్ కామ‌త్ డిజైన్ చేశారు. ఈయ‌న అహ్మ‌దాబాద్‌లో ఉన్న నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పూర్వ విద్యార్థి. అయితే లోగోను ఈయ‌న అలా ఎందుకు డిజైన్ చేశారంటే… అప్ప‌ట్లో బ్యాంకుల్లో క్యాష్ తీసుకోవాల‌న్నా, వేయాలన్నా టోకెన్ సిస్ట‌మ్ ఉండేద‌ట‌. ఆ టోకెన్లు ప్లాస్టిక్ కాయిన్ల‌లా ఉండేవి. అవి మ‌ధ్య‌లో చిన్న రంధ్రాన్ని కలిగి ఉండేవి. దీంతో ఆ ప్లాస్టిక్ కాయిన్ త‌రహాలో నీలి రంగు వృత్తం గీశారు. అనంత‌రం అందులో తెలుపు రంగు పార్ట్‌ని ఎందుకు పెట్టారంటే.. అప్ప‌ట్లో కేవ‌లం ఒక్క సింగిల్ బ్యాంక్ మేనేజరే అన్ని ఊర్ల‌లోనూ బ్యాంక్ ప‌నులు చూసేవారు. క‌నుక ఆ వ్య‌క్తిని సూచించేలా లోగో మ‌ధ్య‌లో తెలుపు రంగు పార్ట్ పెట్టారు. ఇక వృత్తానికి వేసింది ఇండియ‌న్ స‌న్నీ బ్లూ స్కై క‌ల‌ర్‌. అలా ఎస్‌బీఐ లోగోను డిజైన్ చేశారు. ఇక ఈ లోగోను సింపుల్‌గా ఎవ‌రైనా డిజైన్ చేయ‌వ‌చ్చు. దీంతో ఈ లోగో బాగా పాపుల‌ర్ అయింది. అలా అప్ప‌టి నుంచి ఈ లోగోనే ఎస్‌బీఐ వాడుతోంది. ఇదీ.. ఎస్‌బీఐ లోగో వెనుక ఉన్న అస‌లు క‌థ‌..!

Comments

comments

Share this post

scroll to top