దంగల్ రివ్యూ & రేటింగ్ ( తప్పక చూడాల్సిన సినిమా)

Cast & Crew:

  • నటీనటులు: అమీర్ ఖాన్, సనా ఫాతిమా,అపరశక్తి ఖురానా,సాక్షి తన్వార్.
  • డైరెక్టర్: నితేష్ తివారీ
  • మ్యూజిక్ డైరెక్టర్: ప్రీతమ్ చక్రవర్తి.
  • నిర్మాత:అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వాల్ట్ డిస్నీ, UTV పిక్చర్స్.

Story:

మహావీర్ పోగట్( అమీర్ ఖాన్) కుస్తీ పోటీలో దేశానికి బంగారు పతకం తేవాలనే తన కోరికను కొడుకు ద్వారా నెరవేర్చుకోవాలని చూస్తాడు. కానీ మహావీర్ కు నలుగురూ కూతుర్లే పుట్టడంతో నిరాశకు లోనవుతాడు. ఇదే సమయంలో గీతా, బబిత అనే తన ఇద్దరు కూతుర్లు తమను ఏడిపించిన ఇద్దరు కుర్రాళ్లను చెడామడా కొట్టేస్తారు. ఇది గమనించిన మహవీర్…గోల్డ్ మెడల్ తేవడానికి కొడుకే అవసరం లేదు, కూతురైన సరిపోతుందని గ్రహించి….ఈ ఇద్దరు ఆడపిల్లలకు కుస్తీలో ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఇద్దరమ్మాయిలను కుస్తీ యోధులుగా తీర్చిదిద్దే క్రమంలో…చాలా ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తండ్రి ట్రైనింగ్ లో పెద్ద కూతురు గీత రెజ్లింగ్ లో నేషనల్ ఛాంపియన్ షిప్ ను గెలుపొందుతుంది. తర్వాత ఆమెకు నేషనల్ స్పోర్ట్ అకాడమీలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి కోచ్….ఇప్పటి వరకు మీరు తప్పుగా నేర్చుకున్న కోచింగ్ ను మర్చిపోండి, ఇక మీదట నేనిచ్చే కోచింగ్ ఆధారంగా ఆడాల్సి ఉంటుందని చెప్పడంతో….గీత క్రమంగా తండ్రి కోచింగ్ టెక్నిక్స్ ను వదిలి కొత్త కోచింగ్ టెక్నిక్స్ ను ఫాలో అవుతుంది. ఈ క్రమంలో తండ్రితో చిన్నపాటి అభిప్రాయబేధాలు కూడా వస్తాయి. తర్వాత పలు ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన గీత….అన్నింట్లో  ఓటమినే చవిచూస్తుంది. మరో వైపు తన రెండో కూతుర్ని నేషనల్ ఛాపింయన్ గా తీర్చిదిద్దుతాడు మహవీర్. తన తప్పు తెల్సుకున్న గీత…మరల తండ్రి కోచింగ్ టెక్నిక్స్ ను ఫాలో అవుతూ..కామన్ వెల్త్ గేమ్స్ లో దేశానికి బంగారు పతకాన్ని సాధించిపెడుతుంది.

Plus Points:

    • అమీర్ ఖాన్ అద్భుత నటన.
    • బలమైన స్టోరి
    • అదిరిపోయిన స్క్రీన్ ప్లే.

Verdict: ఓ విజయం…భావోద్వేగాల మిళితం..ఈ సినిమా ఆడపిల్లలను తక్కువగా చేసి చూసే సమాజానికి ఓ గుణపాఠం.

Rating: 4.5/5

Trailer: 

Comments

comments

Share this post

scroll to top