“దంగల్” క్లైమాక్స్ సీన్, రియాలిటీకి దూరం.! ఇదిగో ఒరిజినల్ వీడియో.!

కూతుర్లను కుస్తీ యోధులుగా తీర్చిదిద్దే క్రమంలో ఓ తండ్రి పడ్డ తపనే దంగల్. రియల్ స్టోరి ఆధారంగా తీసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.  మహవీర్ పోగట్, గీతా,బబిత పోగట్ ల రియల్  స్టోరి ఆధారంగా తీసిన ఈ సినిమాలో చాలా సీన్లు..వాస్తవానికి దూరంగా తీసారనేది వాస్తవం. ఎంటర్టైన్మెంట్,ఎగ్జైట్మెంట్ కోసం కొంత స్క్రీన్ ప్లే ను జోడించి తీశారు. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్.

2010 ఢిల్లిలో జరిగిన కామన్ వెల్త్ గేమ్ లో భాగంగా….55 KG ల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ఫైనల్ మ్యాచ్ లో గీత పోగట్, ఆస్ట్రేలియా కు చెందిన ఎమిలీ బెన్ట్సెడ్ తో తలపడింది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో గీత 1-0, 7-0 తో ప్రత్యర్థి పై అవలీలగా గెలిచింది. అయితే ఇదే ఫైనల్ మ్యాచ్ ను….. దంగల్ సినిమాలో చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యేలా తీశారు. మొదటి సెట్ ను గీత, రెండవ సెట్ ను బెన్ట్సెడ్, మూడవ సెట్ లో గీత గెలిచిందని చూపించారు. అంతే కాకుండా…. మూడో సెట్ లో కూడా గీత చాలా వెనకపడిందని తర్వాత….తండ్రి మాటలు గుర్తు తెచ్చుకొని ప్రత్యర్థిని గాల్లో ఓ రౌండ్ తిప్పి పడేసి 5 పాయింట్లు సాధించి గెలిచినట్టు చూపించారు.

dangal-match

గీత ఆడిన అంతర్జాతీయ మ్యాచ్ ల వీడియోలను, సినిమాలో అమీర్ ఖాన్ ఓ థియేటర్ లో ప్లే చేసి చూస్తాడు, వాస్తవానికి మహవీర్ పోగట్….ఆ మ్యాచ్ లను ఓ సైబర్ కేఫ్ లో కంప్యూటర్ రెంట్ కు తీసుకొని చూశాడు.

lutavcsxjsi3ca50ixd5

ఫైనల్ గా సినిమా ఈస్ సినిమా అంతే.! ముఖ్యంగా ఆడపిల్లలను కడుపులోనే కత్తెర కాట్లకు బలిచేయాలనుకుంటున్న ఈ సమాజానికి మంచి మెసేజ్ ను ఇచ్చిన సినిమా ఇది.  వాస్తవ కథకు కొన్ని హంగులు కలిపి చెప్పినప్పటికీ ఇందులో తప్పుపట్టాల్సిన అవసరం ఏ మాత్రం లేదనేది నా  అభిప్రాయం.

Watch Geeta Final Mach:

Comments

comments

Share this post

scroll to top