దానం చేస్తే వచ్చే లాభం ఏంటి..? అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా..? అయితే ఈ సమాచారం మీకోసమే!

ప్రార్థించే పెదవులకన్నా దానం చేసే చేతులు మిన్నా అంటుంటారు… దానం ఎందుకు చేయాలి..? దానం ఎప్పుడు చేయాలి.? దానం ఎవరికి చేయాలి? దానం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటీ..? అనే ప్రశ్నలెప్పుడైనా మీకు ఎదురైనప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం మన సామాజిక బాధ్యత…. కష్టాల్లో ఉన్నప్పుడు కాసింత చేయూతనివ్వడం మన కనీస బాధ్యత… అలాగని మన దగ్గర 10 రూపాయలుంటే ఇంకో పది రూపాయలు అప్పుతీసుకొని మరీ దానం చేయడం వెర్రితనం అవుతుంది. చేసే దానం కూడా …వ్యక్తిని బట్టి, పరిస్థితిని బట్టి చేయాలి. దానాన్ని స్వీకరించే వ్యక్తి అవసరాన్ని గుర్తించి దానం చేయడం ఉత్తమం.

chin71

ఏయే దానాల వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయ్.
1. బియ్యాన్ని దానం చేస్తే………పాపాలు తొలగుతాయి.
2. వెండిని దానం చేస్తే……….. మనశ్శాంతి కలుగుతుంది.
3. బంగారుని దానం చేస్తే………దోషాలు తొలగుతాయి.
4.పండ్లను దానంచేస్తే…………బుద్ధి,సిద్ధి కలుగుతాయి.
5. పెరుగును దానం చేస్తే…….ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.
6. నెయ్యి దానం చేస్తే………రోగాలు పోతాయి…..ఆరోగ్యంగా ఉంటారు.
7. పాలు దానం చేస్తే……….నిద్రలేమి ఉండదు.
8. తేనెను దానం చేస్తే….. సంతానం కలుగుతుంది.
9.ఉసిరికాయలు దానం చేస్తే…… మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది.
10. టెంకాయ దానం చేస్తే……… అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.
11. దీపాలు దానం చేస్తే,,,,,,,,, కంటిచూపు మెరుగుపడుతుంది.
12.గోదానం చేస్తే,,,,,,,,,,,,ఋణ విముక్తులౌతారు….ఋషుల ఆశీస్సులు
లభిస్తాయి.
13. భూమిని దానం చేస్తే,,,,,,,,,,బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది.ఈశ్వరలోక
దర్శనం కలుగుతుంది.
14. వస్త్ర దానం చేస్తే………..ఆయుషు పెరుగుతుంది.
15. అన్నదానం చేస్తే…………..పేదరికం తొలగిపోయి …ధనవృద్ధి కలుగుతుంది
ఇవన్నీ దానం చేస్తూ పోతే మనం ఏమవుతాము అని మాత్రం కామెంట్స్ చేయకండి……..ఇవన్నీ మన వేదాలలో చెప్పబడినవి………వాటిలో మీకు సాధ్యపడేది ఒక్కటైనా చేయమని అర్థం…….దయచేసి నెగటివ్ గా
కామెంట్లు పెట్టకండి. ఎందుకంటే అపదలో ఉన్న వాడిని ఆదుకునే సృహను మనం కల్గించే ప్రయత్నం చేద్దాం.
Source: Fb:

Comments

comments

Share this post

scroll to top