ఆ మంత్రి 10 లక్షల విలువ “తెర్మాకోల్” తో డామ్ నీరు ఆవిరైపోకుండా కాపాడమనుకున్నారు..కానీ చివరికి!

గత 140 సంవత్సరాలుగా తమిళనాడు అనావృష్టి ఎదుర్కొంటుంది. అందుకే వారు ప్రతి నీటి చుక్కను వృధా చేయకూడదు అనుకుంటున్నారు. చివరికి ఎండకి ఆవిరైపోవద్దు అని కూడా అనుకుంటున్నారు. అలా అనుకోని ఏం చేసారో తెలుసా..?

తమిళనాడు మంత్రి “సెల్లూర్ రాజు” గారికి ఒక ఐడియా వచ్చింది. మీడియాను తీసుకొని శుక్రవారం రోజు “మధురై” లోని “వైగై” డామ్ దగ్గరకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరవాతే ఆయన ఏం చేయాలనుకుంటున్నారో చెప్పారంట..!

“తెర్మాకోల్” ఉపయోగించి నదిలోని నీటిని ఆవిరపోకుండా కాపాడాలనేది ఆ మంత్రి గారి ఐడియా. “

కానీ మంత్రిగారి ఆశలు బోల్తాపడ్డాయి. పెద్ద గాలి వచ్చేసరికి మామూలు గమ్ తో అంటించిన తెర్మాకోల్ షీట్లన్నీ ఊడిపోయాయి. పడవలో వెళ్లి నీటిలో వదలగానే షీట్లన్నీ ఊడిపోయాయి. పడవలో వెళ్లిన వారు ఒడ్డు దగ్గరికి వచ్చేసరికి తెర్మాకోల్ షీట్లు వచ్చేసాయి. ఒడ్డు దగ్గరున్న మంత్రి గారు మరోసారి తెర్మాకోల్ షీట్లను నీటిలో వదిలే ప్రయత్నం చేసారు. కానీ అవి విరిపోయాయి.


సాధారణంగా ఈ పద్దతిని విదేశాలలో అమలు చేస్తారు. నదిలోని నీరు వేడికి ఆవిరవ్వద్దు అని తెర్మాకోల్ షీట్లు పరుస్తారు. మంత్రి గారు కూడా అదే ఫాలో అవుదాము అనుకున్నారు కానీ ఇలా బోల్తాపడ్డారు!

Comments

comments

Share this post

scroll to top