ఊరి తలరాతను మార్చిన కూలీ.

అతని పేరు హజప్పా. కర్నాటకలోని నెవపాడు లో ఉంటాడు. పండ్లు అమ్మి  రోజూ 100 నుండి 150 సంపాదిస్తాడు. వ్యాపారం కోసం రోజూ నాలుగు కిలో మీటర్లు వెళ్లే హజప్పా తనతో పాటు నడుస్తూ  స్కూల్ కు వెళ్లే  పిల్లలను గమనిస్తుండేవాడు. చదువుకోడానికి పుస్తకాల బరువులు మోసుకుంటూ పిల్లలు అంత దూరం నడవాల్సిన అవసరం  ఏమొచ్చిందని అతడిని అతడే ప్రశ్నించుకున్నాడు… దీన్ని అదిగమించాలని అనుకునే వాడు.

అనుకోవడంతోనే ఆగకుండా ఓ రోజు కలెక్టరేట్ కు వెళ్లి ఓ అర్జీ పెట్టుకున్నాడు. మా ఊరికి స్కూల్ మంజారు చేయండని. స్కూల్ నిర్మాణం అంటే డబ్బుతో కూడుకున్నది కావడంతో సమస్య అంత తొందరగా సాల్వ్ అవ్వలేదు. అయినా వెనక్కి తగ్గని హజప్పా తన ప్రయత్నాలను అలాగే కొనసాగించాడు. చివరకు  గవర్నమెంటు బడి మంజూరు చేసింది. కానీ బిల్డింగ్ లేదు దీని కోసం  అరటి పండ్లు అమ్మి సంపాదించే డబ్బులో కొంత దాచి.. దానికి తోడు కొన్ని విరాళాలు సేకరించి ఓ చిన్న గదిని నిర్మించి అందులో స్కూల్ ను ఏర్పాటు చేశాడు హజప్పా

దీనిని గమనించిన ఓ పత్రిక  హజప్పా గురించి ప్రత్యేక కథనాలను ప్రచురించింది. దీంతో అనేక మంది దాతలు స్పందిచారు. ప్రభుత్వం  ఓ లక్ష రూపాయలు ఇవ్వడంతో  ఆ ఊరిలో హైస్కూల్ కట్టించాడు హజప్పా. అనుకున్నది సాధించిన  హజప్పా  దృష్టి ఇప్పుడు కాలేజీ కట్టించాలనే దానిపై పడింది .  విరాళాలు అడిగేటప్పుడు చీదరించుకున్న వారు, అర్జీ ఇచ్చినప్పుడు గేలి చేసిన వారు, సంపాధించిన డబ్బులో కొంత దాచే టప్పుడు తిట్టిన భార్య…..అందరూ ఇప్పుడు  ఆ ఊరిలోని హైస్కూల్ చూసి నువ్వు గెలిచావ్ హజప్పా అంటున్నారు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top