రోజువారీ రాశిఫలాలు: 28-04-2017

మేషం :

స్త్రీలను గృహంలో ఒక శుభకార్యం చేయాలనే మీ ఆలోచన స్ఫురిస్తుంది. మీ వాగ్ధాటితో ఎదుటివారిని మెప్పిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వ్యవసాయ రంగాల వారికి మెళకువ అవసరం. చేపట్టిన పనుల పట్ల ఆసక్తి ఉండదు.

వృషభం :

ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులు వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమికులకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి.

 

మిథునం :

వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. స్త్రీలకు స్వల్ప అస్వస్థతకు గురువుతారు. రాబడికి మంచి ఖర్చులెదుర్కుంటారు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం : 

ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

 

సింహం :

ఉద్యోగస్తులకు హోదా పెరగడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించబడుతాయి. మిత్రులతో వచ్చిన మార్పు నిరుత్సాహం కలిగిస్తుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం నెరవేరగలదు. మీ కళత్ర ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. దూరప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం.

 

కన్య :

గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రైవేట్ సంస్థలలోని వారికి పనిభారం అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. రావలసిన ధనం చేతికందక పోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలబడతారు.

తుల :

ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు, సమర్థవంతంగా నిర్వహిస్తారు. దంపతుల మధ్య అవగాహన కుదరదు. వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్లుగానే ఉంటాయి.

 

వృశ్చికం

బంధుమిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ప్రేమికులకు అనుమానాలు మరింత బలపడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులు స్వయం కృషితో బాగా రాణిస్తారు.

 

ధనుస్సు :

బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు వాయిదా పడతాయి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. బంధువుల మధ్య ప్రేమాను బంధాలు బలపడతాయి. రవాణా రంగాల్లో వారికి శ్రమకు తగిన ఫలితం కానవస్తుంది. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం.

మకరం 

రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. పారిశ్రామిక రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. దంపతుల మధ్య అవగాహన కుదరదు. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

 

కుంభం : 

ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. ఫ్యాన్సీ, మందులు, రసాయనిక, సుగంధద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునప్పుడు మెళకువ అవసరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అందరికీ సహాయం చేసి మాటపడతారు.

 

మీనం : 

తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగములందు ఆదాయం బాగుంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. రాజకీయాల వారికి పార్టీ పరంగాను, అన్ని విధాలా కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత అవసరం.

Comments

comments

Share this post

scroll to top