రోజువారీ రాశిఫలాలు: 23-05-2017

మేషం :

ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి అనూహ్యమైన అవకాశాలు. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరిగినా తలపెట్టిన పనులు వాయిదా పడతాయి. ఆదర్శప్రాయులైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. రావలసిన బకాయిల విషయంలో మెళకువ అవసరం.

వృషభం :

టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాలలోని వారికి చికాకులు తప్పవు. ఇతరులపై మీరు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవుతాయి. బ్యాంకింగ్ రంగాలలోని వారికి మెళకువ అవసరం. స్త్రీలు ఏ విషయంలోనూ పంతాలకు పోవడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు తోటివారు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు.

 

మిథునం :

పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల కలయికతో నూతనోత్సాహం కానవస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం శ్రేయస్కరం. స్థిరచరాస్తుల విషయంలో ఓ నిర్ణయానికి వస్తారు.

కర్కాటకం : 

ఆర్థిక విషయాల్లో ఆదాయానికి మించిన ఖర్చుకు పొంతన ఉండదు. కొబ్బరి, పూలు, పండ్ల వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమికుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి.

 

సింహం :

ఉద్యోగ వ్యాపార విషయంలో స్వబుద్ధితోనే కార్యములు సానుకీలమవుతాయి. మీ శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉండే అవకాశం ఉంది. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం.

కన్య :

ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్ధుబాటు అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించినంత సంతృప్తిగా ఉండదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారకి మిశ్రమ ఫలితం. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి.

తుల :

విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్యసాధనకు మరింత కృషి చేయవలసి వస్తుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. విద్యా సంస్థలలో వారికి మెళకువ అవసరం. నూతన దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి.

 

వృశ్చికం 

స్త్రీల ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన కుదరదని చెప్పవచ్చు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయటం ఉత్తమం.

 

ధనుస్సు :

వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తి కరంగా ఉంటుంది. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆశాజనకం. గృహ మరమ్మత్తులు, మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి.

మకరం : 

ఉమ్మడి వ్యాపారాలు, తీసుకున్న ఏజెన్సీలు, లీజులు నిదానంగా సత్ఫలితాలనిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగంలోని వారికి శుభం చేకూరుతుంది. ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. మీ అనాలోచిత చర్యలు ఇబ్బందులకు దారితీస్తాయి. బంధువులతో మనస్పర్ధలు ఏర్పడతాయి.

 

కుంభం 

ఆర్థిక విషయాలలో సంతృప్తి కానరాదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా కొనసాగుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే గాని అనుకున్న పనులు పూర్తి కావు. మిత్రులపై మీరు పెట్టుకున్న ఆసలు వమ్ము అవుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాల్ వ్యాపారులకు లాభదాయకం.

 

మీనం : 

విదేశీయానానికి చేయు ప్రయత్నాలలో జయం చేకూరగలదు. దైవ కార్యక్రమాలలో అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు. వాతావరణంలోని మార్పుల వల్ల మీ పనులు వాయిదాపడతాయి. శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. కొంతమంది సూటిపోటి మాటలు మీకు చికాకు కలిగిస్తాయి.

Comments

comments

Share this post

scroll to top