రోజువారీ రాశిఫలాలు: 22-05-2017

 

మేషం :

ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. సినిమా కళాకారులకు అభిమాన బృందాలు అధికమవుతారు. అతిధి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. ఆర్థిక విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.

వృషభం :

మీ నూతన ఆలోచనలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. వాతావరణంలోని మార్పు వ్యవసాయదారులకు ఆందోళన కలిగిస్తుంది. ఇతరుల సలహాను పాటించి సమస్యలను తెచ్చుకుంటారు. న్యాయవాద రంగాల్లోని వారికి మిశ్రమ ఫలితం. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత చాలా అవసరం.

 

మిథునం :

ప్రభుత్వ ఉద్యోగులకు చుట్టుపక్కల వారి నుంచి సమస్యలు తలెత్తుతాయి. రచయితలకు పత్రికా రంగాలలోని వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్లకు, బ్రోకర్లకు సత్‌కాలం. మీ అభిప్రాయాలను బయటికి వ్యక్తము చేసి సమస్యలు తెచ్చుకోకండి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటకం : 

వస్త్ర, పీచు, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు సంతృప్తి, అభివృద్ధి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. దంపతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు.

 

సింహం :

స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రవాణా రంగాల వారికి చికాకులు అధికం. రాజకీయాలో వారు తొందరపడి వాగ్ధానాలు చేయుట వలన మాటపడతారు, రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 

కన్య :

రసాయనిక, మందులు, ఎరువులు, సుగంధద్రవ్య వ్యాపారస్తులకు కలిసివస్తుంది. ప్రభుత్వ రంగాల్లో వారికి మిత్రుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. సంఘంలో మీ పేరుకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

తుల :

ప్రైవేట్, పత్రికా రంగంలోని వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. పెద్దలతో బాధ్యతారహితంగా వ్యవహరించకండి. కలప, ఐరన్, ఇటుక, సిమెంట్ వ్యాపారులకు మిశ్రమ ఫలితం, మార్కెటింగ్, వ్యాపారస్తులకు, వృత్తుల వారికి ఆశించినంత పురోగతి ఉండదు.

 

వృశ్చికం 

రాజకీయనాయకులు తరచు సభా సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో ముఖ్యులతో విభేదాలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి.

 

ధనుస్సు :

కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు పరిష్కారం కావడానికి కొంతకాలం వేచియుండక తప్పదు. పోస్టల్, ఎల్ఐసీ ఏజెంట్లకు శ్రమాధిక్యత మినహా ఆశించినంత ఫలితాలు ఉండవు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తుల శ్రమను అధికారులు గుర్తిస్తారు.

మకరం : 

ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం కొరకు నిరంతర కృషి అవసరం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. మీ యత్నాలకు సన్నిహుతులు అన్ని విధాలా సహకారం అందిస్తారు. ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. మీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం వల్ల భంగపాటు తప్పదు.

 

కుంభం 

విదేశాలు వెళ్ళే ఆలోచన క్రియారూపం దాల్చుతుంది. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి సహకరిస్తాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలు పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. నూతన పెట్టుబడులు, స్పెక్యులేషన్‌లలో ఆచితూచి వ్యవహరించండి.

 

మీనం : 

నూనె, మిర్చి, కంది స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు ఆశాజనకం. విద్యార్థులకు టెక్నికల్, సైన్స్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగుల సమర్థతకు మంచి గుర్తింపు, హోదా లభిస్తాయి. ఒక విషయంలో మీ జీవితభాగస్వామి సలహా పాటించడం వల్ల కలిసిరాగలదు.

 

Comments

comments

Share this post

scroll to top