రోజువారీ రాశిఫలాలు: 16-04-2017

మేషం :

గృహంలో మార్పులవల్ల కొంత అసౌకర్యానికి గురౌతారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి.  మిత్రులను కలుసుకుంటారు. స్త్రీలు విలాస వస్తువులను అమర్చుకుంటారు. కీలకమైన వ్యవహారాల్లో మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది.

వృషభం:

ప్రైవేటు, పత్రిక రంగాలలోని వారికి అధికారులతో సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. దంపతుల మధ్య ఏకీభావం లోపిస్తుంది.  నిరుద్యోగులకు, వ్యాపార రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం.

 

మిథునం:

దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలసి వస్తుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. విద్యార్థుల ఆలోచనలు పక్కదోవ పట్టే ఆస్కారం ఉంది. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి.

కర్కాటకం : 

సిమెంటు, ఇసుక, ఐరన్, కలప వ్యాపారులకు పురోభివృద్ధి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. నిర్మాణ పనులు సంతృప్తికరంగా సాగుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

 

సింహం :

ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. స్థిరచరాస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలలో మెలకువ వహించండి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి కనబరుస్తారు. చిరు వ్యాపారులకు లాభదాయకం.

 

కన్య:

చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమైనప్పటికీ, తగిన ప్రతిఫలం పొందుతారు.  నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలం అవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.

తుల:

కొబ్బరి, పండ్ల, చిరు వ్యాపారులకు కలసి రాగలదు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయంలో మెలకువ వహించండి. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు నిరుత్సాహం తప్పదు. ఉద్యోగస్తులకు అధిక శ్రమ, చికాకులు తప్పవు. ఖర్చులు అదుపు చేయలేకపోవటంవల్ల ఆందోళనకు గురవుతారు.

 

వృశ్చికం

విద్యార్థినులు కొత్త విషయాలపట్ల ఏకాగ్రత, ఉత్సాహం కనబరుస్తారు.  అనుకున్న పనులు వాయిదా పడటంతో స్త్రీలలో ఒత్తిడి, నిరుత్సాహం చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది.

 

ధనుస్సు :

స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం లాంటి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మనిగ్రహం అవసరమని గమనించండి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం అవుతాయి.

మకరం

ఊహించని ఒక లేఖ మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. ఇతరులకు హామీలు ఇచ్చే విషయంలోనూ, మధ్యవర్తిత్వ వ్యవహారాలకు దూరంగా ఉండటం అన్నివిధాలా మంచిది.  హోటల్, తినుబండారాల, క్యాటరింగ్ రంగాలలోని వారికి పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఆశాజనకం.

 

కుంభం : 

స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయటంవల్ల అశాంతికి గురవుతారు. ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు, కొబ్బరి, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు బాధ్యతారహితంగా వ్యవహరించటంవల్ల మాటపడక తప్పదు.  ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.

 

మీనం :

లీజు, ఏజెన్సీ, నూతన పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. స్త్రీలకు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్థులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Comments

comments

Share this post

scroll to top