రోజువారీ రాశిఫలాలు: 13-05-2017

మేషం :

ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలు స్వయం కృషితోనే అనుకూలిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రావలసిన మొండి బాకీలు అతికష్టంమ్మీద వసూలు కాగలవు. ఎడతెగని ఆలోచనలు, అవిశ్రాంత కృషి ఫలితంగా ఆరోగ్యం మందగిస్తుంది.

వృషభం :

సంతకాలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు తోటివారి తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం. మీ సంతానం మొండి వైఖరి వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.

 

మిథునం :

విద్యార్థులు విదేశీ విద్యల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను అందరికీ నచ్చేలా పరిష్కారిస్తారు. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. మీ సంతానం కోసం ధనం ఖర్చు చేస్తారు.

కర్కాటకం : 

దంపతులకు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. దైవసేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన తేలకపోవడంతో నిరుత్సాహం చెందుతారు.

 

సింహం :

రావలసిన ధనం చేతికందడంతో పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. బంగారు, వెండి, వస్త్ర వ్యాపారస్తులు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. బంధువులను కలుసుకుంటారు.

 

కన్య :

వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధికమిస్తారు. అర్థాంతంగా ముగించిన పనులు పునః ప్రారంభమవుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్పెక్యులేషన్ రంగాల వారికి సామాన్యం. మీ బలహీనతలను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ధిపొందాలని చూస్తారు.

తుల :

స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. మీ యత్నాలకు కుటుంబ సభ్యులు సహకరించక పోవడంతో నిరుత్సాహం చెందుతారు. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం.

 

వృశ్చికం 

దంపతుల మధ్య అవగాహన లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. కొంతమందికి మీరు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు మీరే చూసుకోవడం మంచిది. స్త్రీల అభిప్రాయాలకు ఆశించినంత స్పందన ఉండదు. వ్యాపారాలు, సంస్థల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు.

 

ధనుస్సు :

ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. టెండర్లు, లీజు, ఏజెన్సీలు, నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి. సమాచార లోపం వల్ల నిరుద్యోగులు ఒక అవకాశం చేజార్చుకుంటారు.

 

మకరం : 

కొన్ని విషయాలు మీ ఓర్పు, విజ్ఞతకు పరీక్షగా నిలుస్తాయి. రుణాలు, చేబదుళ్ళు తప్పక పోవచ్చు. స్త్రీలపై బంధువులు, చుట్టుపక్కల వారి మాటలు తీవ్ర ప్రభావం చూపుతాయి. దూరప్రయాణాల్లో మెళకువ అవసరం. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. ప్రముఖులతో చర్చలు ప్రశాంతంగా సాగుతాయి.

 

కుంభం 

కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు చికాకులు తప్పవు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల సమాచారం అందుతుంది. మార్కెట్ రంగాల వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికమవుతుంది. గృహంలో పనులు వాయిదాపడతాయి.

 

మీనం : 

విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆపత్సమయంలో సన్నిహితులకు చేదోడువాదోడుగా ఉంటారు. ముఖ్యమైన విషయాలు మీ శ్రీమతికి తెలియజేయడం మంచిది. పత్రికా సంస్థల్లోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం.

Comments

comments

Share this post

scroll to top