మొగుడ్ని చంపించడానికి ప్రియుడితో కలిసి ఎలాంటి ప్లాన్ వేసిందో తెలుసా.? మొగుడికి ఇన్సూరెన్సు చేయించి.!

నేటి సమాజంలో మానవ సంబంధాలు కలుషితం అవుతున్నాయి. డబ్బులకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు కానీ జనాలకు ఇవ్వడం లేదు. సొంత కుటుంబ సభ్యులే డబ్బు కోసం ఒకర్నొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రస్తుత తరుణంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. ఆ మహిళ తన భర్త పేరిట పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్‌ చేయించింది. తరువాత తన సోదరుడు, ప్రియుడితో కలిసి అతన్ని అంతమొందించింది. తరువాత ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకోవాలని చూసింది. చివరకు ఆమె బండారం బయట పడడంతో ఇప్పుడామె జైలులో ఊచలు లెక్కబెడుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

అది ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లె. ఆ గ్రామానికి చెందిన అరవీటి రమేష్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో లూబ్రికెంట్‌ ఆయిల్స్‌ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతని చెల్లెలు రమాదేవి, ఆమె భర్త శ్రీనివాసులు ఇద్దరూ రమేష్‌ వద్ద ఉండేవారు. అయితే డబ్బు కోసం రమాదేవి ఎలాగైనా తన భర్తను వదిలించుకోవాలని అనుకుంది. అందుకు తన సోదరుడు రమేష్‌, ప్రియుడు మధుసూదన్‌ రావుల సహాయం కోరింది. ఇందుకు వారు అంగీకరించడంతో అందరూ కలసి పథకం పన్నారు. ఈ క్రమంలోనే రమాదేవి తన భర్త శ్రీనివాసులు పేరిట పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్‌ చేయించింది.

అందరూ కలిసి శ్రీనివాస్‌ పేరిట రూ.2 కోట్ల వరకు బీమా చేయించారు. తరువాత దానిపై లోన్లు తీశారు. ఇక చివరకు అందరూ కలిసి పథకం ప్రకారం శ్రీనివాసులును తీర్థయాత్ర పేరుతో కర్నూలు జిల్లా యాగంటికి తీసుకెళ్లారు. అక్కడ ఎదురుగా వస్తున్న ఓ లారీ కింద శ్రీనివాసులు తోసేశారు.. కొనఊపిరితో ఉండగా గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత పోలీసుస్టేషన్‌కు వెళ్లి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయినట్లు కట్టుకథ చెప్పారు. ఇక అనంతరం వారు బీమా సొమ్ము క్లెయించేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ మృతుడి బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ దైన శైలిలో ఎంక్వయిరీ చేయగా అసలు విషయం తెలిసింది. వారి బండారం బయట పడింది. దీంతో నిందితులు ముగ్గురూ ఇప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. నిజంగా సమాజంలో మానవ సంబంధాలు ఎంతగా దిగజారాయో ఈ ఘటన మనకు కళ్లకు కట్టినట్టు చెబుతుంది కదా..!

Comments

comments

Share this post

scroll to top