డబ్బు నోట్లు ప్రింట్ చేసే ప్రెస్ నుండి ఈ షూతో 90 లక్షలు కొట్టేసాడు…చివరికి ఎలా దొరికాడా తెలుసా.?

వాహ్‌… మ‌స్తుంది.. నిజంగా ఇప్పుడు చెప్ప‌బోయే దొంగ‌త‌నం అన్ని దొంగ‌త‌నాల క‌న్నా హైలైట్‌. బ‌య‌ట ఎక్క‌డో ఏదో షాపులోనో, ఏదో ఇంట్లోనో దొంగ‌త‌నం చేసే బ‌దులు.. ఏకంగా నోట్ల‌ను ప్రింట్ చేసే కేంద్రంలోనే దొంగ‌త‌నం చేస్తే..? వాహ్‌.. నిజంగా ఐడియా సూప‌ర్ కదా. ఇక అలా దొంగ‌త‌నం చేసే వ్య‌క్తి ఏకంగా ఆ ప్రింటింగ్ ప్రెస్‌లోనే ప‌నిచేస్తుంటే..? అబ్బా.. ఇంకా అంత‌క‌న్నా మించిన గోల్డెన్ చాన్స్ మ‌రొక‌టి ఉండ‌దు క‌దా. అవును, ఆ వ్య‌క్తి కూడా స‌రిగ్గా ఇలాగే అనుకున్నాడు. క‌రెన్సీ నోట్ల‌ను ప్రింట్ చేసే కేంద్రం నుంచే ఏకంగా రూ.90 ల‌క్ష‌ల‌ను కాజేశాడు. కానీ నేరం ఎన్న‌టికీ దాగ‌దు క‌దా, ఏదో ఒక రోజు బ‌య‌ట ప‌డి తీరుతుంది. అత‌ని విష‌యంలోనూ అదే జ‌రిగింది. దీంతో నోట్ల‌ను కాజేస్తూ ఓ రోజున రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌ట్టాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

అత‌ని పేరు మ‌నోహ‌ర్ వ‌ర్మ‌. దేవాస్ అనే ప్రాంతంలో ఉన్న ప్ర‌భుత్వ నోట్ల ముద్ర‌ణ కేంద్రంలో గ‌త కొంత కాలం కింద‌టి వర‌కు క్ల‌ర్క్‌గా ప‌నిచేశాడు. అనంత‌రం ప్ర‌మోష‌న్‌పై నోట్ వెరిఫికేష‌న్ సిస్ట‌మ్ విభాగంలో డిప్యూటీ ఆఫీస‌ర్ అయ్యాడు. అయితే ఆ జాబ్‌లో ప‌నిచేసే అధికారులకు కొంత ఫ్రీడం ఉంటుంది. వారిని సెక్యూరిటీ వారు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అయితే ఇదే విష‌యాన్ని ఆస‌రాగా తీసుకున్న వ‌ర్మ తాను ప‌నిచేస్తున్న స‌ద‌రు కేంద్రంలోనే నోట్ల‌ను కాజేయాల‌ని ప‌థ‌కం ప‌న్నాడు. దాన్ని వెంట‌నే అమ‌లు చేశాడు.

మ‌నోహ‌ర్ త‌న‌ ప‌థ‌కంలో భాగంగా కేంద్రంలో ప్రింట్ అయిన నోట్లను తీసి ఆఫీస్‌లో త‌న క్యాబిన్‌లో చెక్క బాక్సులు, బీరువాల్లో స్టోర్ చేసేవాడు. అనంత‌రం వాటిని త‌న షూస్‌లో పెట్టుకుని ఇంటికి త‌ర‌లించేవాడు. అలా అత‌ను త‌న ఇంటికి ఏకంగా 64.50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను త‌ర‌లించాడు. ఈ క్ర‌మంలో మ‌నోహ‌ర్ క‌ద‌లిక‌ల‌పై అనుమానం వ‌చ్చిన అదే కేంద్రానికి చెందిన ఓ సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారి మనోహ‌ర్‌పై నిఘా పెట్ట‌గా చివ‌ర‌కు అత‌ని బండారం బ‌య‌ట ప‌డింది. దీంతో ఆఫీస్‌లో అత‌ని క్యాబిన్‌లో త‌నిఖీ చేయ‌గా రూ.26.09 ల‌క్ష‌లు దొరికాయి. మ‌రికొన్ని కొత్త నోట్లు చెక్క బాక్సుల్లో ల‌భించాయి. దీంతో ఆ నోట్ల‌ను స్వాధీనం చేసుకున్న ప్రింటింగ్ ప్రెస్ అధికారులు మ‌నోహ‌ర్‌ను పోలీసుల‌కు అప్ప‌గించారు. అవును మ‌రి, దొంగ‌త‌నం చేస్తే అది ఎన్న‌టికీ దాగ‌దు, ఏదో ఒక రోజున ఏదో ఒక విధంగా బ‌య‌ట ప‌డుతుంది..!

Comments

comments

Share this post

scroll to top