ఎయిర్టెల్ కు దిమ్మతిరిగే షాక్..! ఎందుకో తెలుసా.? కారణం ఆ ఐపీఎల్ యాడ్.! అసలేమైంది.?

రిల‌య‌న్స్ జియో.. టెలికాం రంగంలో ఓ సంచ‌ల‌నం.. ఆది నుంచి ఆక‌ట్టుకునే ఆఫర్ల‌ను త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తూ వ‌స్తోంది. జియో 4జీ, జియోఫై రూటర్‌, జియో ఫోన్‌.. త్వ‌ర‌లో జియో ల్యాప్‌టాప్‌లు.. ఇలా అనేక సేవ‌ల‌ను జియో అందిస్తోంది. ఇక హైస్పీడ్ మొబైల్ డేటా ఇప్పుడు మ‌న‌కు అంత త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందంటే.. అదంతా జియో పుణ్య‌మే అని క‌ళ్లు మూసుకుని మ‌రీ చెప్ప‌వచ్చు. అయితే జియో దెబ్బ‌కు ప్ర‌త్య‌ర్థి టెలికాం కంపెనీల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు భారీగా న‌ష్టాలే వస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్ కు జియో దెబ్బ బాగానే తాకింది. అయితే తాజాగా కూడా మ‌రోసారి జియో చేతిలో ఎయిర్‌టెల్ భంగ‌ప‌డింది. అది ఎలాగో తెలుసా..?

ఐపీఎల్ మ్యాచ్‌లను ప్ర‌సారం చేసే హ‌క్కులు స్టార్ ఇండియాకు ఉన్నాయి క‌దా. అందుకే టీవీ చాన‌ల్స్‌లో స్టార్ కు చెందిన చాన‌ళ్ల‌లో మాత్ర‌మే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అవుతున్నాయి. ఇక ఐపీఎల్ డిజిట‌ల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ కూడా స్టార్ మీడియాకే ఉన్నాయి. అందుక‌నే ఆ సంస్థ‌కు చెందిన హాట్ స్టార్ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే జియోతోపాటు ఎయిర్ టెల్ కూడా త‌మ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు త‌మ టీవీ యాప్ ల ద్వారా ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను చూసేందుకు అవ‌కాశం క‌ల్పించాయి.

అయితే అంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఎయిర్‌టెల్ మాత్రం స‌ద‌రు ఐపీఎల్ మ్యాచ్ ల డిజిటల్ ప్ర‌సారాల‌పై అభ్యంత‌ర‌క‌ర యాడ్‌ను ప్ర‌దర్శించింది. అదేమిటంటే.. కేవ‌లం ఒక ఎయిర్‌టెల్ 4జీ సిమ్ 4జీ ఫోన్‌లో వేసుకుని ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. ఆ యాప్ లో ఐపీఎల్ ప్ర‌సారాల‌ను చూడ‌వ‌చ్చ‌ని యాడ్ ఇచ్చింది. నిజానికి ఐపీఎల్‌ డిజిట‌ల్ రైట్స్ త‌న‌కే ఉన్న‌ట్లుగా ఎయిర్‌టెల్ ఆ యాడ్‌లో బిల్డ‌ప్ ఇచ్చింది. దీంతో ఆ యాడ్‌పై జియో కేసు వేసింది. ఢిల్లీ హైకోర్టులోఎయిర్‌టెల్‌కు వ్య‌తిరేకంగా కేసు వేయ‌గా, విచార‌ణ‌లో న్యాయ‌మూర్తి జియోకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఐపీఎల్ డిజిట‌ల్ రైట్స్ హాట్‌స్టార్ కు ఉన్న‌ప్ప‌టికీ ఎయిర్ టెల్ అలా త‌మ యాప్ ద్వారా మ్యాచ్ ప్ర‌సారాల‌ను ఇస్తున్నామ‌ని ప్ర‌చారం చేసుకోవ‌ద్ద‌ని, అది తప్ప‌ని, హాట్‌స్టార్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్ ప్ర‌సారాల‌ను ఇస్తున్నామ‌ని, అలాగే యాడ్‌లోనూ చెప్పాల‌ని హైకోర్టు చెప్పింది. దీంతో ఎయిర్‌టెల్ ఆ యాడ్‌ను మార్చ‌క త‌ప్ప‌లేదు. ఏది ఏమైనా.. జియో వ‌చ్చాక ఇత‌ర టెలికాం కంపెనీల ఆట‌లు అస్స‌లు ఏమాత్రం సాగ‌డం లేవ‌నే చెప్ప‌వచ్చు..!

Comments

comments

Share this post

scroll to top