ఎయిర్టెల్ ప్రకటించిన వెంటనే దివాళికి “రిలయన్స్ జియో” బంపర్ ఆఫర్…ఎలా పొందాలో తెలుసా.?

Krishna

కస్టమర్లకు దివాళీ ఆఫర్ ప్రకటించింది జియో. ఎయిర్ టెల్ 4G స్మార్ట్ ఫోన్ ప్రకటించిన వెంటనే.. జియో నుంచి ఈ ప్రకటన వెలువడింది. దీపావళి సందర్భంగా కస్టమర్లకు 100శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ మధ్య 399 రూపాయల ధన్ ధనా ధన్ ఫ్లాన్ కి రీఛార్జ్ చేసుకుంటే.. అంతే మొత్తానికి ఎనిమిది ఓచర్లను ఇస్తోంది జియో. ఒక్కో ఓచర్ విలువ 50 రూపాయలు. అంటే 400 రూపాయలు విలువైన టాక్ టైం ఇస్తోంది. వీటిని నవంబర్ 15వ తేదీ తర్వాత నుంచి ఎప్పుడైనా వాడుకోవచ్చు.

రూ.309 ఫ్లాన్ పైన లేదా రూ.91 డేటా యాడ్ ఆన్ ఫ్లాన్ రీఛార్జ్ లో ఈ ఓచర్లను ఉపయోగించుకోవచ్చు. అన్ని ఓచర్లను ఒకేసారి ఉపయోగించుకోవటానికి సాధ్యం కాదు. రీఛార్జ్ చేసుకునే సమయంలో ఒక్కో ఓచర్ ను యాడ్ ఆన్ చేసుకోవాలి. 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాలంటే 18వ తేదీలోపు ధన్ ధనా ధన్ ఆఫర్ కింద రూ.399 ఫ్లాన్ రీచార్జ్ చేసుకోవాలి. స్టోర్స్, ఆన్ లైన్ ద్వారా ఎక్కడ చేసుకున్నా ఈ ఓచర్లు ఇస్తారు.

Comments

comments