కరెంటు తీగను తాకితే మనిషికి షాక్‌ కొడుతుంది. కానీ పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు. ఎందుకు?

సాధారణంగా కొన్ని పక్షులు విద్యుత్ సరఫరా చేసే స్తంభాల తీగలకు తగిలినప్పుడు అవి మరణిస్తాయి, కానీ అన్ని అలా మరణించవు, వాటికి ఒక కారణం ఉంది. ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే స్తంభాలకు సాధారణంగా నాలుగు తీగలు ఉంటాయి. అందులో మూడు తీగల్ని ఫేజులు అని, ఒకదాన్ని న్యూట్రల్‌ అనీ అంటారు. ఒక ఫేజు తీగకు, మరో ఫేజు తీగకు మధ్య, ఒక ఫేజు తీగకు, న్యూట్రల్‌ తీగకు మధ్య విద్యుత్‌ పొటన్షియల్‌ ఉంటుంది. ఒక వ్యక్తిలోగానీ, వస్తువులో కానీ, జంతువులోగానీ విద్యుత్‌ ప్రవహించాలంటే దానికి అటూ ఇటూ విద్యుత్‌ పొటెన్షియల్‌ తేడా ఉండాలి.

అంటే ఒక వ్యక్తికి షాక్‌ కొట్టాలంటే ఏకకాలంలో కనీసం రెండు తీగలతో అనుసంధానం ఉండాలి. అప్పుడు అధిక పొటెన్షియల్‌ ఉన్న తీగలోకి, అల్ప పొటెన్షియల్‌ ఉన్న తీగ నుంచి ఎలక్ట్రాన్లు ఆ వ్యక్తి ద్వారా ప్రయాణిస్తాయి. ఇలా ఎలక్ట్రాన్లు శరీరంలో ప్రవహిస్తేనే ప్రమాదం. మనుషులు కూడా కేవలం ఒకే తీగను పట్టుకుని వేలాడితే ఏమీ కాదు. నేలను చెప్పుల్లేకుండా తాకితేనో, లేదా రెండు వైర్లను ఏకకాలంలో తగిలితేనో ప్రమాదం. పక్షుల విషయానికి వస్తే అవి ఒకే సమయంలో రెండు తీగలపై వాలవు. కాబట్టి వాటి దేహం ద్వారా విద్యుత్‌ ప్రవహించదు. పొరపాటున అది అటొక కాలు, ఇటొక కాలు ఒకేసారి పెడితే షాకుకి గురవుతుంది. ఇలాంటి సంఘటనలు కూడా అడపాదడపా జరుగుతూ ఉంటాయి.

కలర్ టీవీ తెర అంచు చుట్టూ నల్లటి పట్టీ ఉంటుంది ఎందుకు ? ఒక విధం గా చెప్పాలంటే రంగుల టీవీ తెర అంచు చుట్టూ కనిపించే నల్లని పట్టీ టీవీ లోని పిక్చర్ ట్యూబ్ కి రక్షణ కవచం లాంటిది . పిక్చర్ ట్యూబ్ లోపల ఉండేది శూన్య ప్రదేశం కాబట్టి అది టీవీ వెలుపల ఉండే వాతావరణ పీడనాన్ని తట్టుకోవాలి . పాతకాలం టీవీ లలో ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ షీల్డులు పిక్చర్ ట్యూబ్ చుట్టూ అమర్చి ఉండేవి . పిక్చర్ ట్యూబ్ కి లోపల ,వెలుపల ఉండే వాతావరణ పీడనాల తేడా వల్ల పేలుడు సంభవించకుండా ఇవి కాపాడేవి . కాని ఇప్పటి టీవీ లలో పేలుళ్ళ నుంచి రక్షణ కోసం ప్లాస్టిక్ షీల్దులకు బదులు ” కిమ్ కోడ్ “అనే లోహపుచాత్రాన్ని పిక్చర్ ట్యూబ్ చుట్టూ తన్యతతో ఉండే పట్టీతో బిగిస్తున్నారు. మనకు తెర అంచుల చుట్టూ కనిపించే నల్లని పట్టీ ఇదే.

 

Comments

comments

Share this post

scroll to top