స్నానం చేస్తుండగా వివాహిత తో అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ ఆఫీసర్, కలకలం రేపిన ఘటన..!!

మహిళల ను వేధింపులకు గురిచేసే కచరా బ్యాచ్ తోలు తీసేది పోలీసులే, కానీ ఆ కచరా బ్యాచ్ లో పోలీస్ వాడు కూడా ఉంటే, ఇంక ఆమె ఎవరికి చెప్పుకోవాలి, ఒక మహిళను బలవంతం చేయబోయాడు, అది కూడా పెళ్లి అయి పిల్లలు ఉన్న మహిళను. భర్త, పిల్లలు పక్కన ఉన్నా కూడా ఆమెను బలవంతం చేయబోయాడు, ఈ సంఘటన గోవా రాష్ట్రం లో జరిగింది, వివారాల్లోకెళితే..

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజ్‌వీర్ ప్రభుదయాల్ సింగ్ అనే 43 ఏళ్ల వ్యక్తి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) లో కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు, మంగళవారం గోవా లోని కలంగుటే బీచ్‌కి వెళ్లిన రాజ్‌వీర్ కన్ను అక్కడ భర్తా పిల్లలతో కలిసి స్నానం చేస్తున్న మహిళపై పడింది, ఆమె దెగ్గరకు వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు రాజ్‌వీర్, ఆమె రాజ్‌వీర్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది, కానీ రాజ్‌వీర్ ఇంకా రెచ్చిపోయాడు. ఆమె భర్త రాజ్‌వీర్ ను వదిలేయమని ప్రాధేయపడగా చంపేస్తా అని బెదిరించి ఆమె చెయ్యి పట్టుకొని లాగడానికి ప్రయత్నించాడు. రాజ్‌వీర్ భారి నుండి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఉద్యోగం స్వాహా.. :

సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌ రాజ్‌వీర్ పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఫోర్స్ రిక్రూట్ ట్రెయినింగ్ సెంటర్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు రాజ్‌వీర్. ఒకవేళ రాజ్‌వీర్ నేరం కానీ నిరూపితం అయితే అతని ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది, ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగం లో విధులు నిర్వర్తిస్తున్న వారు ఇలా తప్పు చెయ్యడం ఎంతో సిగ్గు చేటని నెటిజన్స్ రాజ్‌వీర్ పైన మండిపడుతున్నారు, పెళ్లి అయి పిల్లలు ఉన్న ఆడపిల్ల పైన అందరి ముందు ఇలా బలవంతం చేసాడంటే, ఇంక ఎవరు లేని ఆడపిల్లలను పెళ్లి కానీ ఆడపిల్లలను ఇంకెంత నరకానికి గురిచేసి ఉంటాడో అని మహిళా సంఘాలు రాజ్‌వీర్ పైన మండిపడుతున్నారు. రాజ్‌వీర్ పైన ప్రభుత్వం కఠిన చర్య తీసుకోడం ఖాయం గా కనిపిస్తుంది.

 

 

 

Comments

comments

Share this post

scroll to top