క్రికెట‌ర్ భార్య‌కు గ‌ర్భ‌స్రావం…అభిమానుల సూటిపోటి మాట‌లే కార‌ణం.!

ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ భార్య‌కు గ‌ర్భస్రావం అయ్యింది. బాల్ ట్యాంప‌రింగ్ కార‌ణంగా అభిమానుల సూటిపోటి మాట‌లే ఈ గ‌ర్భస్రావానికి కార‌ణ‌మని వార్న‌ర్ వైఫ్ క్యాండీస్ మీడియా ముందు చెప్పుకొచ్చారు. బాల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని తట్టుకోలేని ఆసీస్ అభిమానులు వార్నర్ భార్య క్యాండీస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసభ్య పదజాలంతో దూషించారు. అప్పటికే గర్భవతిగా ఉన్న క్యాండీస్ అభిమానుల విమర్శలు, వ్యక్తిగత దూషణల కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనైంది. దీనికి తోడు క్రికెట్ ఆస్ట్రేలియా పిలుపుతో సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఆస్ట్రేలియా చేరుకోవాల్సి రావడం.. తదితర కారణాల వల్ల క్యాండీస్‌కు గర్భస్రావమైంది. వార‌సుడు వ‌స్తాడ‌నుకున్న వేళ‌…ఇలా జ‌ర‌గ‌డం నిజంగా మా ఇద్ద‌ర్నీ ఏడ్చేలా చేసింద‌ని త‌న దుఖాన్ని మీడియా ముందు పెట్టారు వార్న‌ర్ దంప‌తులు.

Watch Video:

బాల్ ట్యాంప‌రింగ్ కు పాల్ప‌డిన వీడియో:

 

Comments

comments

Share this post

scroll to top