క్రికెట‌ర్‌గా రాణించ‌డానికి కేదార్ జాద‌వ్ ఎంత‌టి క‌ష్టాలు ప‌డ్డాడో తెలుసా..?

కేదార్ జాద‌వ్‌. భార‌త క్రికెట్ జ‌ట్టులో ఇప్పుడిత‌ను ఓ కీల‌క ఆట‌గాడు. తాజాగా జ‌రిగిన ఆస్ట్రేలియా వ‌న్డే సిరీస్ కావ‌చ్చు, అంత‌కు ముందు జ‌రిగిన ఇంగ్లండ్ సిరీస్ కావ‌చ్చు. కేదార్ జాద‌వ్ త‌న‌కు అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకున్నాడు. దీంతో వ‌రుస సిరీస్‌ల‌లో అత‌ను జ‌ట్టుకు సెలెక్ట్ అవ‌డ‌మే కాదు, తాను ఆడిన ప్ర‌తి మ్యాచ్‌లోనూ స‌త్తా చాటుతున్నాడు. అయితే నిజానికి మీకు తెలుసా..? ఇప్పుడు కేదార్ జాద‌వ్ వ‌య‌స్సెంతో..? 32 సంవ‌త్స‌రాలు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఈ వ‌య‌స్సులోనూ కేదార్ జాద‌వ్ క్రికెట్‌లో మెరుపులు సృష్టిస్తున్నాడు. లేటుగా జ‌ట్టులోకి వ‌చ్చినా అద్భుత‌మైన ఆట తీరుతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాడు. అయితే ఈ స్థాయికి రావ‌డానికి నిజానికి కేదార్ జాద‌వ్ చాలానే క‌ష్ట‌ప‌డ్డాడ‌ని చెప్ప‌వ‌చ్చు.

కేదార్ జాద‌వ్‌ది మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్ జిల్లా మ‌ధా అనే గ్రామం. అక్క‌డే జాద‌వ్ పుట్టి పెరిగాడు. అత‌నికి ముందు ముగ్గురు అక్క‌లు ఉన్నారు. అయితే వారు చ‌దువుల్లో చాలా బ్రిలియంట్. కానీ కేదార్ జాద‌వ్‌కు చ‌దువు స‌రిగ్గా అబ్బలేదు. అయితే క్రికెట్‌పై మాత్రం బాగా ఆస‌క్తి ఉండేది. ఈ క్ర‌మంలోనే 9వ త‌ర‌గ‌తిలో చ‌దువుకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. అనంత‌రం ఫుల్ టైం క్రికెట్‌లో కోచింగ్ తీసుకున్నాడు. అత‌ని తండ్రి విద్యుత్ విభాగంలో ఓ క్ల‌ర్క్‌. అయిన‌ప్ప‌టికీ కేదార్ జాద‌వ్‌కు క్రికెట్‌లో మంచి కోచింగ్ ఇప్పించాడు. దీంతో జాద‌వ్ తండ్రి క‌ష్టాన్ని వృథా పోనివ్వ‌లేదు. ఈ క్ర‌మంలోనే క్రికెట్‌లో బాగా రాణించాడు. అనేక‌మైన మెళ‌కువ‌ల‌ను అత‌ను నేర్చుకున్నాడు. ఆ త‌రువాత తాను ఆడిన మ్యాచ్‌ల‌లో అద్భుత‌మైన ప్ర‌తిభ చూప‌డంతో 2004వ సంవ‌త్స‌రంలో మ‌హారాష్ట్ర అండ‌ర్ 19 టీంకు ఎంపిక‌య్యాడు.

ఇక 2012 నుంచి 2014 వ‌ర‌కు కేదార్ జాద‌వ్‌కు బాగా అచ్చి వ‌చ్చిన కాలం అని చెప్ప‌వచ్చు. ఎందుకంటే ఆ స‌మ‌యంలో జాద‌వ్ తాను ఆడిన రంజీ మ్యాచ్‌ల‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. 2012లో జ‌రిగిన ఓ జాతీయ‌ మ్యాచ్ లో ఏకంగా 327 ప‌రుగుల‌తో ట్రిపుల్ సెంచ‌రీ సాధించి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. 2013-14 రంజీ సీజ‌న్‌లో ఏకంగా 1223 ప‌రుగులు సాధించాడు. అందులో 6 సెంచ‌రీలు ఉన్నాయి. ఆ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రంజీ ప్లేయ‌ర్‌గా జాద‌వ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

కాగా జాద‌వ్ 2013లో ఐపీఎల్‌లో అడుగు పెట్టాడు. అప్ప‌ట్లో అత‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడాడు. అనంతరం 2016లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగుళూరుకు ఆడాడు. అయితే ఐపీఎల్‌లో రాణిస్తున్న‌ప్ప‌టికీ అత‌నికి అవ‌కాశం రాలేదు. చివ‌ర‌కు అత‌నికి 32వ ఏట 2014లో బంగ్లాదేశ్ తో ఆడే చాన్స్ వ‌చ్చింది. 2015లో జింబాబ్వేతో ఇండియా ఆడిన మ్యాచ్‌లోనూ జాద‌వ్‌కు అవ‌కాశం రాగా అత‌ను దాన్ని స‌ద్వినియోగం చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో కేవ‌లం 87 బంతుల్లోనే 105 ప‌రుగులు సాధించాడు. అదే అత‌ని మొద‌టి వ‌న్డే సెంచ‌రీ కావ‌డం విశేషం.

ఆ త‌రువాత ఇంగ్లండ్‌తో జ‌రిగిన సిరీస్‌లోనూ జాద‌వ్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను చిత‌క‌బాదాడు. ఓ మ్యాచ్‌లో అత‌ను ఏకంగా 76 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 120 ప‌రుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో ఇండియా 356 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఆ మ్యాచ్‌లో భార‌త్ గెలుపొందింది. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ఈ వ‌య‌స్సులో వికెట్ల మ‌ధ్య చురుగ్గా క‌దులుతాడు జాద‌వ్‌. ఈ విష‌యాన్ని కెప్టెన్ కోహ్లి స్వ‌యంగా తెలిపాడు. సాధార‌ణంగా మూడు ప‌దుల వ‌య‌స్సు దాటాక క్రికెట్ ప్లేయ‌ర్లు రిటైర్ ఎప్పుడు అవుదామా అని చూస్తుంటారు. కానీ జాద‌వ్‌కు ఈ వ‌య‌స్సులోనే అవ‌కాశం వ‌చ్చింది. దాన్ని అత‌ను స‌ద్వినియోగం చేసుకున్నాడు. అందుకు అత‌ను ప‌డిన శ్ర‌మ‌ను మాటల్లో వ‌ర్ణించ‌లేం. అత‌ని కెరీర్ ఇంకా ఎద‌గాల‌ని మ‌న‌మూ కోరుకుందాం..!

Comments

comments

Share this post

scroll to top