మావోయిస్టుల దాడిలో మృతి చెందిన జ‌వాన్ల కుటుంబాల‌కు భ‌రోసా ఇచ్చిన క్రికెట‌ర్ గౌతం గంభీర్‌..!

ఏ ఇంట్లో అయినా ఆ కుటుంబ య‌జ‌మాని చ‌నిపోతే ఆ కుటుంబ స‌భ్యుల‌కు ఎంత బాధ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. దీనికి తోడు వారిని అన్ని క‌ష్టాలు చుట్టు ముడ‌తాయి. వారిని ఆదుకునే వారుండ‌రు. ఇటీవ‌లే న‌క్స‌లైట్ల దాడిలో మృతి చెందిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల కుటుంబ స‌భ్యుల ప‌రిస్థితి కూడా స‌రిగ్గా ఇలాగే ఉంది. అయితే అంత‌టి ద‌య‌నీయ స్థితిలో ఉన్న‌వారిని ఆదుకునేందు క్రికెట‌ర్ గౌతం గంభీర్ ముందుకు వ‌చ్చాడు. వారికి అన్ని విధాలా స‌హాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించి మాన‌వ‌త‌ను చాటుకున్నాడు.

ఏప్రిల్ 24వ తేదీన చ‌త్తీస్‌గ‌డ్‌లోని సౌత్ సుక్మా ఏరియాలో మావోయిస్టులు జ‌రిపిన మెరుపు దాడిలో 25 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. దీంతో ఆ జ‌వాన్ల కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి. వారి భార్యా పిల్ల‌లు దుఃఖిస్తుంటే చూసిన వారికి ఎంతో బాధ క‌లిగింది. అలా బాధ ప‌డిన వారిలో క్రికెట‌ర్ గౌతం గంభీర్ కూడా ఉన్నాడు. అందుకే వెంట‌నే ప్ర‌క‌టించేశాడు, ఆ 25 మంది జ‌వాన్ల కుటుంబ స‌భ్యుల‌కు తాను అండ‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించాడు.

గౌతం గంభీర్ తాను న‌డుపుతున్న ఫౌండేష‌న్ ద్వారా ఆ జ‌వాన్ల పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పిస్తాన‌ని తెలిపాడు. అంతేకాదు, ఆ కుటుంబాల‌ను ఆదుకునేందుకు చేతనైనంత సాయం చేస్తాన‌ని అన్నాడు. అన‌డ‌మే కాదు, తాను ప్ర‌స్తుతం ఆడుతున్న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ టీం ఆట‌గాళ్ల‌ను కూడా అందుకు స‌మాయ‌త్తం చేశాడు. మొన్నా మ‌ధ్యే పూణెతో జ‌రిగిన మ్యాచ్‌లో నైట్ రైడ‌ర్స్ ఆట‌గాళ్లు అంద‌రూ చేతికి రిస్ట్ బ్యాండ్ల‌ను ధ‌రించారు. వాటిపై ఓ ట్విట్ట‌ర్ హాష్ ట్యాగ్‌ను కూడా వారు ప్రింట్ చేశారు. ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించారు. వాట‌న్నింటినీ గౌతం గంభీర్ ఆ జ‌వాన్ల కుటుంబాల‌కు అంద‌జేయ‌నున్నాడు. నిజంగా, క్రికెట్‌లోనే కాదు, రియ‌ల్ లైఫ్‌లోనూ గౌతం గంభీర్ హీరోయే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top