ఒలంపిక్స్ లో….T-20 కి చోటు కల్పించాలంటున్న సచిన్, మరి మీరేమంటారు.!

ధనాధన్  క్రికెట్  టి-ట్వంటీ ఇప్పుడు ఒలంపిక్స్ లో  కూడా అలరించడానికి ముహుర్తం ఖరారయ్యేలా కనిపిస్తుంది.! 1900 సంవత్సరం తర్వాత ఒలంపిక్స్ నుండి దూరమైన క్రికెట్ మళ్ళీ ఇప్పుడు ఒలంపిక్స్ లో భాగం కానుంది. ఆమేరకు ప్రయత్నాలు కూడా  ముమ్మరం అయ్యాయి. సచిన్ టెండూల్కర్ తో పాటు షేన్ వార్న్ కూడా ఒలంపిక్స్ లో అత్యంత ప్రజాధరణ కలిగిన క్రికెట్ ఉండాలన్నారు. సచిన్ అయితే  ఓ అడుగు ముందుకేసి ఇప్పటికే మంచి ఆదరణ ఉన్న T20 ని ఒలంపిక్స్ గేమ్స్ లిస్ట్ లో చేరిస్తే అదో అద్భుత ప్రయోగం అవుతుందని అన్నారు.

ఈ మేరకు ఒలంపిక్స్ కమిటీ కూడా తీవ్ర కసరత్తులు చేస్తోంది.  దీని కోసం ఐసిసి తో  చర్చించనుంది. వచ్చే నెలలో జరగనున్న సదస్సులో బిడ్డింగ్ గురించి కూడా మాట్లాడనున్నారు. 2024 ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలని ఇప్పటికే కొన్ని క్రికెట్ సంఘాలు విజ్ఞప్తులు చేశాయి. ఒకవేళ ఒలింపిక్స్ కమిటీ ట్వంటీ20 క్రికెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ధనాధన్ దంచి కొట్టుడు ఇక  ఒలింపిక్స్‌లోనూ చూడొచ్చన్నమాట.

మరి మీరేమంటారు… ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చితే ఎలా ఉంటుంది. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి!

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top