క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

క్రెడిట్ కార్డ్… ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కంపల్‌సరీ ఉంటున్న కార్డు. 12 వేలకు పైగా జీతం ఉంటే చాలు, ప్రతి బ్యాంక్ క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ వాళ్లు ఇస్తున్నారని… అవసరమైన సమయంలో ఉపయోగపడుతుందని చాలా మంది క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డును ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారా. క్రెడిట్ కార్డ్ లావాదేవీలలో మీరు చేసే చిన్న పొరపాటుకి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు అసలు ఎలా వాడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

సమయానికి క్రెడిట్ కార్డు బిల్ చెల్లించకపోవడం.

కరెంట్ బిల్లు, క్రెడిట్ కార్డు బిల్లు గడువులోకా చెల్లించకుండా తర్వాత ఫైన్ తో కట్టడం చాలా మంది చేసే మొదటి పొరపాటు. కరెంట్ బిల్లు ఫైన్ తో కట్టినా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు… కానీ క్రెడిట్ కార్డుకు ఫైన్ తో పాటు సిబిల్ స్కోర్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి గడువులోకా బిల్లు చెల్లించకపోతే స్కోర్ 80-110 పాయింట్లు పడిపోయే ప్రమాదం ఉంది. బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డు బిల్లింగ్ గడువు లోగా చెల్లిస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తుంటారు. ఎప్పుడైనా బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు క్రెడిట్ కార్డు రీపేమెంట్ కూడా చెక్ చేస్తారు. అందుకే క్రెడిట్ కార్డు బిల్లును గడువు లోగా చెల్లించడం అలవాటు చేసుకోండి.

అధికంగా క్రెడిట్ కార్డు వాడడం.

బ్యాంక్ ఎంత లిమిట్ ఇస్తే అంత వాడుకుంటూ ఉంటారు చాలా మంది. మీరు మొత్తం లిమిట్ వాడుకున్నా బ్యాంకులు ఎలాంటి అడ్డు చెప్పవు. కానీ క్రెడిట్ స్కోర్ ఇచ్చే సంస్థలు మాత్రం మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ను పరిశీలిస్తారు. అంటే మీకు ఇచ్చిన లిమిట్ లో ఎంత వాడుకుంటున్నారు అనేది చెక్ చేస్తారు. మీకు లక్ష రూపాయలు లిమిట్ ఇస్తే 30-40 శాతం మాత్రమే వాడుకోవాలి అలా కాదని మొత్తం వాడినా… మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. అందుకే మీరు కార్డు తీసుకొన్నప్పుడే 30-40 శాతం వాడుకునేలా ఒక లిమిట్ పెట్టుకోండి.

క్రెడిట్ కార్డు ఈఎంఐలు.

ఫ్లిప్ కార్ట్, అమెజాన్, పేటీఎం లాంటి ఆన్లైన్ షాపింగ్ సంస్ధలు క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి, నో కాస్ట్ ఈఎంఐ అని కనపడగానే చాలా మంది ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటారు. కేవలం రూ. 10 వేల రూపాయల ఫోన్ కొన్నా కూడా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటారు. ఇలా చెయ్యడం వల్ల మీరు తక్కువ మొత్తాన్ని కూడా ఒకేసారి కొనలేరేమో అనే భావన వస్తుంది. ఇది కూడా మీ స్కోర్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

క్రెడిట్ కార్డుతో నగదు విత్ డ్రా చెయ్యడం.

క్రెడిట్ కార్డుతో నగదు విత్ డ్రా చేసే సౌకర్యం ఉంటుంది. కానీ ఇందుకోసం క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ 3.5 శాతం చెల్లించాల్సి వస్తుంది. దీంతో పాటు కొన్ని కొన్ని బ్యాంకులు మరిన్ని ఛార్జీలు వేస్తాయి. అందుకే క్రెడిట్ కార్డుతో నగదు విత్ డ్రా చెయ్యడం అలవాటు చేసుకోకండి.

క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోకపోవడం.

క్రెడిట్ కార్డు వాడే వాళ్లకి క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ గురించి తెలియదు. క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చన్న విషయం కూడా తెలియదు. అన్ లైన్ లో క్రెడిట్ రిపోర్ట్ ను ఉచితంగా చెక్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు రిపోర్ట్ చెక్ చేసుకోవడం వల్ల మనం చేసే తప్పులు ఏంటో మనకు తెలుస్తాయి. దీంతో ఆ తప్పులు

మరోసారి చేసే ఆస్కారం ఉండదు.

వెంట వెంటనే మూడు నాలుగు క్రెడిట్ కార్డులకు అప్లై చెయ్యడం
మీరు క్రెడిట్ కార్డు అప్లై చేసేటప్పుడే మీ క్రెడిట్ రిపోర్ట్ కోసం బ్యాంకులు అప్లై చేస్తాయి. ఇలా పదే పదే బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్ట్ కోసం అప్లై చెయ్యడం కూడా క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపుతాయి. మీరు తక్కువ సమయంలో లోన్లు, క్రెడిట్ కార్డులు అప్లై చెయ్యడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. ఒకసారి క్రెడిట్ కార్డు రిజక్ట్ అయితే మళ్లీ కొన్ని రోజులు తర్వాతే మళ్లీ అప్లై చెయ్యండి.

రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చెయ్యడం.

చాలా మంది క్రెడిట్ కార్డు ఉపయోగిస్తారు కానీ వాటికి వచ్చే రివార్డ్ పాయింట్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. అలా రెండు మూడేళ్లు రివార్డ్ పాయింట్స్ వాడుకోకపోతే ఎక్స్ పైరీ అవుతాయి. దీనివల్ల మీకు రావాల్సిన అదనపు ప్రయోజనాలను కోల్పోతారు. అందుకే రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేసుకుని అదనపు లాభాలు పొందండి.

పాత క్రెడిట్ కార్డులు డీ యాక్టివేట్ చెయ్యడం.

ఇది అందరూ చేసే అతి పెద్ద తప్పు. చాలా మంది పాత క్రెడిట్ కార్డులను క్యాన్సిల్ చేసుకుని ఆఫర్ల కోసం కొత్త కార్డులను తీసుకుంటారు. కానీ… బ్యాంకులు మాత్రం మీరు ఎంత కాలం నుంచి కార్డులు వాడుతున్నారు అనేది చూస్తాయి. మీ దగ్గర ఎక్కువ కాలం ఒకటే కార్డు ఉంటే మీకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది.

 

Comments

comments

Share this post

scroll to top