వాట్సాప్ లో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా.? బెస్ట్ ఐడియా.!!

వాట్సాప్‌.. దీని గురించి పెద్ద‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎందుకంటే నేటి త‌రుణంలో స్మార్ట్‌ఫోన్లు ఉన్న ప్ర‌తి ఒక్క‌రు ఇందులో మునిగి తేలుతున్నారు. వాట్సాప్ గ్రూప్‌ల‌లో ఉంటూ ఫొటోలు, వీడియోలు, సందేశాలు షేర్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. గ్రూప్స్‌ల‌లో లేక‌పోయినా తోటి వాట్సాప్ యూజ‌ర్ల‌తో ముందు చెప్పిన కంటెంట్‌ను షేర్ చేసుకుంటున్నారు. అయితే.. వాట్సాప్ గ్రూప్స్ అంటే.. ఒక విష‌యం గుర్తొచ్చింది. మీరు వాట్సాప్‌లో ఏ గ్రూప్‌కైనా అడ్మిన్‌గా ఉన్నారా..? ఉంటే ఫ‌ర్లేదులే. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేది అనేక మంది యూజ‌ర్లు ఉన్న గ్రూప్ గురించి కాదు. కేవ‌లం ఒక్క‌రే ఉండే గ్రూప్ గురించి. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. అదేంటీ.. గ్రూప్‌లో ఒక్క‌రే అంటే.. దాన్ని క్రియేట్ చేసిన వారే ఉంటారు క‌దా, మ‌రి దాంతో ఏం లాభాలుంటాయి..? మ‌న‌కు మ‌న‌మే మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపుకుని ఎంజాయ్ చేయాలా..? అంటే.. కాదు, అందుకు కాదు. దాంతో కొన్ని ఉప‌యోగాలు ఉంటాయి. అవేమిటంటే…

వాట్సాప్‌లో కొత్త‌గా ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. ఎవ‌రైనా ఒక యూజ‌ర్‌ను గ్రూప్ మెంబ‌ర్‌గా సెలెక్ట్ చేసుకోండి. వెంట‌నే వ‌చ్చే స్క్రీన్‌లో గ్రూప్ పేరు ఎంట‌ర్ చేయండి. మీ ఇష్టం వ‌చ్చిన పేరు దానికి పెట్టుకోండి. దీంతో గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఇక గ్రూప్ ఓపెన్ చేసి అందులో సెట్టింగ్స్‌పై క్లిక్ చేసి మీరు అంత‌కు ముందు యాడ్ చేసిన యూజ‌ర్‌ను రిమూవ్ చేయండి. దీంతో గ్రూప్‌లో మీరు ఒక్కరే ఉంటారు. ఇక మీ ఇష్టం. అందులో మీరు ఏమైనా పోస్ట్ చేసుకోవ‌చ్చు. ఇక ఆ ఖాళీ గ్రూప్ ను ఎలా వాడుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఇంట‌ర్నెట్ లో ఏవైనా వెబ్‌సైట్స్ చూస్తున్న‌ప్పుడు మీకు ఏదైనా వెబ్‌సైట్ న‌చ్చితే దాన్ని వెంట‌నే మీ ఖాళీ వాట్సాప్ గ్రూప్‌లో సేవ్ చేసుకోవ‌చ్చు. మ‌ళ్లీ దాన్ని కావాల‌నుకున్న‌ప్పుడు సుల‌భంగా ఓపెన్ చేసి చూడ‌వ‌చ్చు.
2. కేవ‌లం వెబ్‌సైట్ పేర్లే కాదు, ఇంట‌ర్నెట్‌లో ఏదైనా మీకు అవ‌స‌రం అయిన స‌మాచారం ఉంటే ఆ గ్రూప్‌లో షేర్ చేసుకోవ‌చ్చు. మ‌ళ్లీ కావాల‌నుకుంటే ఎప్పుడైనా చూడ‌వ‌చ్చు.
3. ఇదే త‌ర‌హాలో ఫొటోలు, వీడియోలు, యూట్యూబ్ లింక్‌లు, మీ వ్య‌క్తిగ‌త స‌మాచారం, రోజువారీ ఖ‌ర్చులు, ఏ స‌మ‌యంలో ఏం చేయాలి వంటి వివ‌రాల‌ను ఆ ఖాళీ గ్రూప్‌లో పెట్టుకోవ‌చ్చు.

అంటే ఒక ర‌కంగా చెప్పాలంటే ఆ ఖాళీ వాట్సాప్ గ్రూప్ మీకు ఓ ప‌ర్స‌న‌ల్ ప్లాన‌ర్‌గా ప‌నిచేస్తుంద‌న్న‌మాట‌. ఎప్పుడైనా ఏదైనా స‌మాచారం నోట్ చేసుకోవాల‌నుకున్నా గ్రూప్ లోకి ఎంట‌ర్ అయిపోయి ఆ స‌మాచారాన్ని సెండ్ చేసుకోవ‌చ్చు. ఇక గ్రూప్‌లో ఎలాగూ మీరు ఒక్క‌రే ఉంటారు కాబ‌ట్టి, ఆ స‌మాచారం ఇత‌రుల‌కు తెలియ‌దు. ఇంత‌కీ.. ఈ ఖాళీ వాట్సాప్ గ్రూప్ ఐడియా ఎలా ఉంది..? భ‌లేగా లేదూ..!

Comments

comments

Share this post

scroll to top