పిడుగు పడడం అంటే ఏమిటి? అదెలా పడుతుంది? దాని నుండి రక్షించుకోడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

పిడుగు అంటే ఆకాశములో సహజసిద్ధముగా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతము. మేఘాలు ఢీ కొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని, ఉత్పన్నమయిన విద్యుత్‌ను పిడుగు అని అంటారు. మనకు కనిపించే మేఘం లో రెండు భాగాలు ఉంటాయి. పైన ఉన్న భాగం పాజిటివ్ ఛార్జ్ తో ఉంటే , క్రిందనున్నది నెగటివ్ ఛార్జ్ తో ఉంటుంది. మేఘం లో నెగటివ్ ఎనర్జీ , పక్క మేఘం లో పాజిటివ్ ఎనర్జీ కి తగిలితే , ఆకాశంలో మనకు మెరుపు కనిపిస్తుంది. అదే మేఘం లో నెగటివ్ ఎనర్జీ భూమి మీద పాజిటివ్ ఎనర్జీ తో కలిస్తే పిడుగు అవుతుంది. వాస్తవానికి మనకు కనిపించే మెరుపు…భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ నుండి మేఘాన్ని చేరుతుంది అంతే కాని ఆ మెరుపు మేఘం నుండి భూమికి చేరదు.

 

పిడుగులు పడే సమయంలో పాటించాల్సిన  జాగ్రత్తలు;

  • ఎత్తైన భవనాలు , పెద్ద చెట్లు మీద పిడుగులు ఎక్కువగా పడుతాయి, ఎక్కువ ఎత్తులో ఉన్నభవనాలు , చెట్లు పిడుగులను తమ వైపుకు ఎక్కువగా ఆకర్షిస్తాయి.
  • బాగా మెరుపులు ఉరుములతో కూడిన వర్షం వస్తుంటే బయట ప్రదేశంలో ఉన్నవారు…తమ రెండు చేతులు రెండు మోకాళ్ళ మీద పెట్టు కొని ,తల క్రిందకు వంచి ఎటువంటి చెట్లు లేని చోట చేతులు భూమికి తగల కుండా అరికాళ్ళ మీద కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుకోవొచ్చు.
  • టాప్ క్లోస్ చేసి ఉన్న వాహనాల మీద పిడుగు పడడం తక్కువ..ఎందుకంటే, కప్పు మూసివేసిన వాహనాలు లో కూర్చొంటే, వాటి పెద్ద ఉపరితలం విద్యుత్ ను అన్ని దిక్కులకు పంపించి తర్వాత భూమిని చేరుతుంది. తద్వారా పిడుగు ఎఫెక్ట్ ను అంతగా లేకుండా చేస్తుంది .
  • పిడుగులు పడే అవకాశం ఉందని అనిపిస్తే ఇంట్లోని కిటికీలన్నీ మూసివేయాలి.
  • చెట్లకు ,పొడవైన భవంతులకు, ట్రాన్స్ఫార్మర్ లకు దూరంగా ఉండడం మంచిది.
  • ఈ సమయంలో సముద్రం, నది , చెరువులలో ఈత కొట్టటం చేయకూడదు.
  • ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ లైన్ వాడకూడదు, పిడుగు ఎఫెక్ట్ ఫోన్ లైన్ మీద పడితే మీరు పట్టుకొన్న ఫోన్ కి కూడా ఎఫెక్ట్ చేయొచ్చు
  • ఎత్తైన భవనాలు, సినిమాహాలు వంటి నిర్మాణాలలో మెరుపుకడ్డీలు అమర్చడం ద్వారా విద్యుత్ ప్రవాహంను నేరుగా భూమిలోనికి పంపిస్తారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top