ఆవు ఆత్మ‌హ‌త్య చేసుకుంది..! (వీడియో)

ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయ్యాన‌నో… లవ్ ఫెయిలైంద‌నో… ఆర్థిక స‌మ‌స్యల వ‌ల్లో… కొంద‌రు సూసైడ్ చేసుకుంటారు. అయితే సూసైడ్ అనేది మ‌నుషులే చేసుకుంటారు. వేరే ఇత‌ర ఏ జీవీ సూసైడ్ చేసుకోదు. ఏదైనా ప్ర‌మాదం జ‌రిగో లేదంటే అనారోగ్యం వ‌ల్లో మ‌ర‌ణించాల్సిందే త‌ప్ప సృష్టిలోని ఇతర ఏ ప్రాణి అయినా సూసైడ్ చేసుకోదు గాక చేసుకోదు. కానీ… అక్క‌డ ఓ ఆవు ఆత్మ‌హత్య చేసుకుంది. అవును, షాకింగ్‌గా ఉన్నా మీరు వింటున్న‌ది నిజ‌మే. ఆవు ఏకంగా బిల్డింగ్‌పైకి ఎక్కి మ‌రీ ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డింది.

cow-suicide

అది మ‌న దేశంలో ఓ ప్రాంతంలో ఉన్న బిజీ మార్కెట్‌. అక్క‌డ ఓ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నం ఉంది. దాని మీద‌కు ఉన్న‌ట్టుండి ఓ ఆవు ఎక్కింది. అది ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో, ఎవ‌రికి చెందిందో కూడా తెలియదు. ఈ క్ర‌మంలో బిల్డింగ్ మీద‌కు ఎక్కిన ఆవును ర‌క్షించేందుకు కొంద‌రు దాని వెన‌కాలే వెళ్లారు కూడా. అయితే అంత‌లోపే ఆ ఆవు భ‌వ‌నం పై నుంచి కింద‌కు దూకింది. దీంతో అక్కడికక్క‌డే ఆ ఆవు మృతి చెందింది. అయితే అలా ఆవు దూకుతున్న స‌మ‌యంలో కొంద‌రు ఆ వీడియోను షూట్ చేశారు. అనంత‌రం దాన్ని యూట్యూబ్‌లో పెట్టారు. ఇప్పుడా వీడియో వైర‌ల్ అవుతోంది. కొన్ని ల‌క్ష‌ల మంది ఆ వీడియోను వీక్షించారు కూడా. మ‌రి దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Video:

చూశారుగా..! ఆవు కింద‌కు దూకి ఎలా ఆత్మ‌హ‌త్య చేసుకుందో. అయితే నిజానికి మ‌నుషులే కాదు, జంతువులు కూడా డిప్రెష‌న్‌కు గుర‌వుతాయ‌ట‌. అందుకే అవి కూడా ఆత్మ‌హ‌త్య చేసుకునే చాన్స్ ఉంటుంద‌ట‌. దీన్ని గురించి ప‌లువురు సైకియాట్రిస్ట్‌లు కూడా చెబుతున్నారు. గతంలో ఓ దేశంలో ఓ కుక్క కూడా ఇలాగే నీళ్ల‌లోకి దూకి సూసైడ్ చేసుకుంద‌ట‌. బాతులైతే త‌మ పార్ట్‌న‌ర్స్ చ‌నిపోతే అవి కూడా సూసైడ్ చేసుకుంటాయ‌ట‌. అవును, మీరు వింటున్న‌ది నిజ‌మే. అయితే మ‌రి…వాటికి కౌన్సిలింగ్ ఇవ్వ‌లేమా..? అంటే ఇవ్వ‌లేం. ఎందుకంటే జ్ఞానం ఉన్న మ‌నుషులను కూడా వారు సూసైడ్ చేసుకుంటారా లేదా అన్న‌ది క‌నిపెట్ట‌లేం. ఇక మూగ‌జీవాల‌ను ఎలా క‌నిపెడ‌తాం, వాటికి ఎలా కౌన్సిలింగ్ ఇస్తాం..? ఇవ్వ‌లేం..!

Comments

comments

Share this post

scroll to top