ఫొటోలో అక్కడ చెమట పట్టిందని “మిథాలీ” ని ఎలా అవమానించాడో తెలుసా? దానికి కెప్టెన్ కౌంటర్ హైలైట్!

టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీరాజ్ పై కామెంట్ చేసిన ఓ నెటిజన్ కు ఆమె తగిన రీతిలో సమాధానం చెప్పింది. బెంగళూరులో ఓ క్రికెట్ సెంటర్ ను మిథాలీరాజ్ నిన్న ప్రారంభించింది.

ఈ సందర్భంగా తన సహచర క్రికెటర్లు వేదా కృష్ణమూర్తి, మమతా మాబెన్, నూషిన్ అల్ ఖదీర్ తో దిగిన ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో మిథాలీ రాజ్ పోస్ట్ చేసింది. ‘ఎంతో ప్రత్యేకమైన ఈ మహిళల సరసన నిలబడి ఉన్న ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు!!’ అని తన ట్వీట్ లో మిథాలీ పేర్కొంది.

ఈ ఫొటోలో ఉన్న మిథాలీ స్లీవ్ లెస్ టాప్ ధరించి ఉంది. ఆమె ఎడమ భుజం కింద భాగంలో కొంచెం చెమటపట్టి టాప్ తడిసిపోయి ఉంది. అయితే, ఈ ట్వీట్ పై స్పందించిన ఓ నెటిజన్, ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ‘ సారీ ఎస్ఎంటీ కెప్టెన్, హాహాహా అసహ్యంగా కనపడుతోంది …’అని అన్నాడు.

ఇందుకు స్పందించిన మిథాలీరాజ్ తన దైన శైలిలో ఘాటుగా జవాబిచ్చింది. ‘నేను గ్రౌండ్ లో చెమటోడ్చిన కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నాను. క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవం కోసం గ్రౌండ్ లో ఉన్న నేను, అందుకు, సిగ్గుపడాల్సిన పని లేదు’ అని పేర్కొంది. అయితే, సదరు నెటిజన్ రాతలపై తోటి నెటిజన్లు మండిపడ్డారు.‘ ఆమె అసహ్యంగా కనపడటం కాదు, ఎంతో అందమైన ఈ ప్రపంచంలో నువ్వు పుట్టడమే అసహ్యం’ అని ఓ నెటిజన్ మండిపడ్డాడు.

 

Comments

comments

Share this post

scroll to top