మొక్కజొన్న నీ ఆరోగ్యానికి మంచిదన్నా…!

మొక్కజొన్న నీ మేలు మరవలేనిది. నా స్వీట్ హార్ట్ స్వీట్ కార్న్ నిన్ను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను. నీగురించి తెలిసాక సర్వ ఔషదాలు నాతోనే ఉన్నాయనే ధైర్యం కలిగింది. ఇక నిన్ను విడిచిపెట్టేదిలేదు. ఐలవ్ యూ స్వీట్ హాట్.. స్వీట్ కార్న్…  ఏంటీ మొక్కజొన్నను ఇంతలా పొగుడుతున్నారు అనుకుంటున్నారా… ఇందులో ఉన్న ఔషదాలను తెలుసుకుంటే మీరు వెంటనే మార్కెట్ కు వెళ్లి కేజీ లకు కేజీలకు  తెచ్చుకుంటారు.

అవును మొక్కజొన్నలో ఉన్న లాభా లు అన్నిఇన్ని కావు. చాలా దీర్ఘ కాలిక వ్యాధులకు అమృత ఔషదంలా పనిచేస్తుంది. మనకు తెలిసి మొక్కజొన్నను కాల్చుకొని తింటాం, ఉడకబెట్టుకొని తింటాం, మహా అయితే కార్నుఫ్రై, పాప్ కార్ను మనకు తెలిసినవి ఇవ మాత్రమే. తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో చాలా ఔషదాల్లో, తినుబండారాల్లో, విస్కీల్లో, పౌడర్లలో, ఇంకా చాలా వరకు తయారీల్లో ప్రధాన పాత్రపోషిస్తుంది. ముఖ్యంగా ఔషదాల్లో మొక్క జొన్నపాత్ర కీలకమైనది.

corn in india

 

కార్న్ లో ఉన్నటువంటి లూతెయిన్, జీక్జాన్ డిన్, అనే ఎమినోన్స్ మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి . లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రిబోప్లోవిన్, ఆరోగ్యానికి ఎంతోసహకరిస్తాయి. మొక్కజొన్న వలన మదుమేహం, రక్తలేమి, జీర్ణక్రియను మెరుగుపరచడం, మలపద్దకం నివారణ, చిన్నప్రేవుల పనితీరును మెరుగుపరచటం, కొలస్టరాల్ నియంత్రించడం, మూత్రపిండాల పనితీరు, ఇలా ఎన్నో ధీర్ఘ కాలిక వ్యాదులను నియంత్రించడంలో మొక్కజొన్న దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ప్రపంచంలో 4వ స్థానానికి మొక్కజొన్న పంట చేరుకుందంటే దీని ప్రత్యేకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

corn

 

ఇంకేంటి ఇది మొక్క జొన్న పొత్తులు మార్కెట్ లో దొరికే సీజన్.. వెళ్లండి సంచులు పట్టుకొని మార్కెట్ కు… మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top