నిర్మాత దిల్ రాజుపై కేసు. మిస్టర్ ఫర్పెక్ట్ కథ నాది అంటూ కేసు పెట్టిన రచయిత్రి.!

ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై మాధాపూర్ పీఎస్ లో కాపీరైట్ చట్టం కింద ఛీటింగ్  కేసు నమోదైంది. శ్యామలా రాణి అనే రచయిత్రి తన అనుమతి తీసుకోకుండా తన ‘నా మనసు కోరింది నిన్నే’ నవల ఆధారంగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తీశారని పోలీసులను ఆశ్రయించారు.సినిమాలో ప్రతీ సీను తన నవలలో ఉన్నట్టుగానే చిత్రీకరించారని ఆరోపించిన శ్యామల, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరథ్ లపై 120 ఎ, 415, 420, తో పాటు కాపీ రైట్ యాక్ట్ సెక్షన్ 63 కింద కేసు నమోదు చేశారు.

ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2011లో ఆగస్టులో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. అయితే ఇన్నేళ్ల తరువాత కేసు వేయటంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో ఇటీవల టీవీలో ప్రసారం అయినప్పుడు తాను  సినిమా చూసానని శ్యామల అన్నారు. నిర్మాతపై ఆరోపణలు చేయకుండా ఎవరో తన కథను వాళ్ల కథగా దిల్ రాజుకు వినిపించారని తెలిపారు.సినిమాలో 28 సీన్లు తన నవల ఆధారంగానే తెరకెక్కాయని, ఇక మీదట మరే భాషలో అయిన ఈ సినిమా రీమేక్ చేస్తే తన పేరును టైటిల్ లో వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు..ఈ సినిమాలో ప్రభాస్ సరసన కాజల్,తాప్సీ హీరోయిన్లుగా  నటించారు.

దిల్ రాజు ఈ ఏడాది శతమానం భవతి, నేను లోకల్, ఫిదా లాంటి బ్లాక్ బస్టర్లను అందించారు. అంతేకాకుండా మహేశ్ బాబు నటించిన స్పైడర్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ, పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రాలను పంపిణీ చేస్తున్నారు. అలాగే రవితేజతో రాజా ది గ్రేట్ అనే సినిమాను నిర్మిస్తున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top