కాపీ కొట్టిందని ఇన్విజిలేటర్ తిట్టినందుకు…బిల్డింగ్‌ పైనుంచి దూకిన విద్యార్థి..!

ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే వరంగల్‌ అర్బన్‌ హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీలో ఘోరం జరిగింది. ఇంటర్ మొదటి ఇయర్ పరీక్షకు హాజరైన రక్షారావు అనే విద్యార్ధిని కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ కు పట్టుబడింది. దీంతో అనవమాన భారం భరించలేక రక్షారావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.


కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం నాగారం గ్రామానికి చెందిన కొలసాని వెంకటరావు కుమార్తె రక్షారావు హన్మకొండలోని ఎస్‌ఆర్‌ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఈ కళాశాలకు సంబంధించి పరీక్ష కేంద్రం హన్మకొండ కిషన్‌పురంలోని ఆర్‌డీ కళాశాలలో పడింది.
ఈ భవనంలోని మూడో అంతస్తులో మొదటి సంవత్సరం సంస్కృతం పరీక్ష రాయడానికి వచ్చింది. కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ కు పట్టుబడడంతో ఛీఫ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకు కాపీ చేస్తున్నావని వారు ప్రశ్నించడంతో అవమానంగా ఫీలైన రక్షారావు ఒక్కసారిగా భవనంపై నుంచి కిందకి దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రగాయాలయ్యాయి. కళాశాల నిర్వాహకులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top