కాపీ కొట్టిందని బయటకు పంపారని సూసైడ్ చేసుకుంది ఇంజనీరింగ్ స్టూడెంట్…చివరి మెసేజ్ ఏంటంటే.?

చెన్నైలోని ఓ డీమ్డ్ వర్సిటీలో తెలుగు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నగర శివారులోని సత్యభామ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ (బీఎస్సీ కంప్యూటర్ సైన్స్) చదువుతున్న హైదరాబాద్‌ విద్యార్థిని రాగమౌనికా రెడ్డి మృతిపై తోటి విద్యార్థులు బుధవారం (నవంబర్ 22) ఆందోళనకు దిగారు. సోమవారం జరిగిన ఇంటర్నల్‌ పరీక్షల్లో కాపీ కొట్టిందనే ఆరోపణలతో అధ్యాపకులు ఆమెను పరీక్ష హాలు నుంచి బయటకు పంపించారు. మంగళవారం కూడా పరీక్షకు హాజరు కానివ్వలేదు. దీన్ని అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

వర్సిటీలో రాధా మౌనిక ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్ధుల విధ్వంసానికి పాల్పడ్డారు. హాస్టల్, తరగది గదులలోని ఫర్నిచర్‌తో పాటు బస్సులు, ఇతర వాహనాలకు విద్యార్థులు నిప్పుపెట్టారు. తమ స్నేహితురాలి మృతికి యాజమాన్యమే కారణమంటూ ఆందోళన చేపట్టారు విద్యార్థులు. వర్సిటీ ప్రాంగణంలో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి కాలేజీ యాజమాన్యం సమాచారం అందించింది. వర్సిటీకి చేరుకున్న పైర్ ఇంజన్లను విద్యార్దులు లోపలికి రానివ్వకుండా అడ్డుకునే యత్నం చేశారు. వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని లోనికి వెళ్లనిచ్చి మంటల్ని అదుపులోకి తీసుకురావాలని చూస్తున్నారు.

‘మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్’ అని స్నేహితులకు మెసేజ్ పెట్టి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హృదయ విదారకమైన ఈ సంఘటన తోటి విద్యార్థులచే కంటతడి పెట్టించింది.ఆ అమ్మాయి కాపీ కొట్టే అవకాశమే లేదని, ఒక బ్రిలియంట్ స్టుడెంట్ ను అవమానించి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు.

Comments

comments

Share this post

scroll to top