కూలీ అకౌంట్లో రూ.200 కోట్లు… చిట్ ఫండ్ మోసం చేశాడ‌ని అరెస్టు చేసిన పోలీసులు… విష‌యం తెలిసి షాక్‌..!

రాత్రికి రాత్రే మీ అకౌంట్‌లో రూ.200 కోట్లు ప‌డితే ఎలా ఉంటుంది..? నిజంగానే షాక్‌కు లోన‌వుతారు క‌దా. మీరే కాదు, ఎవ‌రైనా అలాగే ఫీల‌వుతారు. అయితే… అలా డ‌బ్బు అకౌంట్‌లో ప‌డినందుకు పోలీసులు మిమ్మ‌ల్ని చీట‌ర్స్ అని చెప్పి అరెస్టు చేస్తే..? అప్పుడెలా ఉంటుంది..? దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది..! ఏం చేయాలో అర్థం కాదు. అవును మ‌రి, అప్పుడు ఎవ‌రికైనా అలాగే అనిపిస్తుంది. అదిగో… ఆ ఇద్ద‌రు యువ‌కుల‌కు కూడా స‌రిగ్గా అలాగే జ‌రిగింది. ఇంత‌కీ అస‌లు విష‌య‌మేమిటంటే..!

vikas

వారి పేర్లు వికాస్‌, విన‌య్‌. వీరిద్ద‌రూ చ‌త్తీస్‌గ‌డ్‌లో ఉన్న ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియా ఫేజ్‌-1 సంజ‌య్ కాల‌నీలో నివాసం ఉంటున్నారు. వికాస్ స్థానికంగా కూలి ప‌నులు చేసుకుంటూ జీవిస్తూ ఉండ‌గా, విన‌య్ ఓ సంస్థ‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను అమ్మే మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు. అయితే వీరిద్ద‌రూ అన్నాద‌మ్ములే. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ స్థానికంగా ఉన్న వీఎన్‌సీ కంపెనీ అనే ఓ చిట్‌ఫండ్ కంపెనీలో ఉద్యోగం కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. ఆ కంపెనీ య‌జ‌మాని బ‌ల్జిత్ సంధు. కాగా గ‌త కొంత కాలంగా సంధు త‌న చిట్‌ఫండ్ కంపెనీలో ప్రజ‌లు దాచుకున్న డ‌బ్బును క్ర‌మంగా దోచుకుంటూ వ‌చ్చాడు. అయితే అలా దోచుకున్న డ‌బ్బు సొంత అకౌంట్‌లో ఉంటే ఇబ్బంది అవుతుంద‌ని తెలుసుకున్న సంధు ఓ ఉపాయం ప‌న్నాడు.

వికాస్‌, విన‌య్‌లు జాబ్ అప్లికేష‌న్ కోసం పెట్టుకున్న ద‌ర‌ఖాస్తుల‌ను సంధు టాంప‌ర్ చేశాడు. వాటితో వికాస్‌, విన‌య్‌ల పేరిట వారికి తెలియ‌కుండానే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటిలో రూ.200 కోట్ల వ‌ర‌కు జ‌మ చేశాడు. అనంత‌రం ఓ రోజు వాటిని విత్‌డ్రా చేసుకుని పారిపోయాడు. అలా అత‌ను త‌న చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేశాడు. తీరా బాధితుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌గా తెలిసిందేమిటంటే… ఆ రూ.200 కోట్లు వికాస్‌, విన‌య్‌ల బ్యాంక్‌ అకౌంట్ల‌లో లావాదేవీ అయిన‌ట్టు గుర్తించారు. దీంతో వారిద్ద‌రినీ పోలీసులు అరెస్టు చేసి విచారించ‌గా అస‌లు విష‌యం తెలిసింది. ప్ర‌స్తుతం సంధు ప‌రారీలో ఉండ‌గా, త‌మ‌కు తెలియ‌కుండానే తాము ఈ నేరంలో చిక్కుకున్నందుకు వికాస్‌, విన‌య్‌లు ఇద్ద‌రూ చాలా విచారం వ్య‌క్తం చేస్తున్నారు. అవును మ‌రి, అమాయ‌కులు ఉంటే సంధు లాంటి మోసగాళ్లు మ‌న స‌మాజంలో అడుగ‌డుగునా క‌నిపిస్తారు. కాబ‌ట్టి… ఇలాంటి వారితో బ‌హు ప‌రాక్‌..!

Comments

comments

Share this post

scroll to top