ఇంజనీరింగ్ మరియు మెడిసన్ చదివిన వారికి మాత్రమే కాదు.. వీరికి కూడా జీతము బాగానే ఉంటుంది !

ఒక్కప్పుడు చాలా మటుకు చదవడం అంటే ఇంజనీరింగ్ లేదా మెడిసన్ అనే అనుకునేవారు. చాలా తక్కువ మంది మాత్రమే వేరే కోర్స్ల వైపు వెళ్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంజనీరింగ్ లేదా మెడిసన్ మాత్రమే కాదు ఇంకా అనేక రంగాల్లో కూడా కోర్సులు చేస్తున్నారు. అయితే వీరికి కూడా ఇంజనీర్లు లేదా వైద్యుల లాగే జీతం కూడా బాగానే వస్తుంది. మరి ఆ ఉద్యోగాలు ఏంటో చూసేద్దామా..

యానిమేషన్ మరియు VFX:
బాహుబలి వంటి సినిమాలు చూసాక తెలిసే ఉంటుంది VFX వారికి ఎంత పని ఉంటుందో. గత కొన్ని ఏళ్ళ నుండి VFX మరియు యానిమేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యాయి. మొదట్లో నెలకు పదిహేను వేలు వచ్చిన కొంచెం అనుభవం వస్తే నెలకు లక్షల జీతం వస్తాయి.

ఈవెంట్ మేనేజ్మెంట్:
ఇప్పుడు ఉన్న బిజీ జీవితాల్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలి అంటే కూడా అన్ని సమకూర్చుకోవడానికి తగ్గినంత సమయం ఉండట్లేదు. అందుకనే ఈవెంట్ మేనేజర్లకు ఆ పనులు అప్పచెబుతారు. వీరికి ఒక ఈవెంట్ కి దాదాపు లక్ష రూపాయిల వారికి వస్తాయి.

డిజె:
మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్నవారికి ఈ వృత్తి బాగా నప్పుతుంది. ఇప్పుడు మ్యూజిక్ మరియు ఎంటర్టైన్మెంట్ రంగం విజృంభిస్తున్న రంగాలు. ఇందులోకి అడుగు పెట్టి విజయం సాధించిందానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ వృత్తికి అవసరం అయ్యే కోర్సులు అందించడానికి కళాశాలలు కూడా ఉన్నాయి.

స్పోర్ట్ కామెంటేటర్:
ఏదైనా స్పోర్ట్స్ చూస్తున్నాము అంటే తప్పనిసరిగా కామెంట్రీ ఉండాల్సిందే. కామెంట్రీ లేకుండా ఎలాంటి ఆటను చూడలేము. స్పోర్ట్ కామెంటేటర్లకు కూడా జీతం బాగా వస్తుంది, ఈ వృత్తిలో మంచిగా స్థిర పడిన వారికి ఒక రోజుకి దాదాపు పాతిక వేలు ఇస్తారు.

చెఫ్:
వంట చెయ్యడమంటే ఇష్టం ఉన్నవారికి చెఫ్ గా రాణించే అవకాశాలు చాలా ఉన్నాయి. వీరు కేవలం వంట చెయ్యడమే కాదు వివిధ వంట పద్ధతులు, పదార్థాలు, పోషణ, వంటకాలు మరియు రుచులు నేర్చుకుంటారు. హోటల్ మానేజ్మెంట్ కోర్సులు చేసేవారికి చెఫ్ గా మారే అవకాశాలు ఉన్నాయి.

మర్చంట్ నేవీ:
మర్చంట్ నేవీ వారికి ఎక్కువగా పని ఉండదు, కేవలం అవసరం ఉన్నపుడు మాత్రమే కార్గో మరియు అప్పుడప్పుడు ప్రయాణీకులను రవాణా చెయ్యాల్సి ఉంటుంది. వీరికి కొత్త కొత్త ప్రదేశాలు చూసే అవకాశం కూడా లభిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top