యుద్దంలో మేజర్ మరియు జవాన్ ల మద్య సంభాషణ. విన్నారంటే ఉన్నపళంగా లేచి,నిలబడి సెల్యూట్ కొడతారు.

యుద్దం జరుగుతోంది, దడ్… దడ్… దడ్…. అంటూ ఒకటే బాంబుల మోత, ఓ వైపు మేజర్, మరోవైపు  జవాన్ ఇద్దరూ కలిసి శత్రువుల వైపు తమ గన్ లను ఎక్కు పెట్టి ప్రతి దాడులు చేస్తున్నారు. ఓ వైపు యుద్దం చేస్తూనే మరోవైపు మేజర్ తో మాట కలిపాడు జవాన్ . ఈ ఇద్దరి సంభాషణ పూర్తిగా విన్న తర్వాత నేనైతే నిలబడి జైహింద్ అంటూ సెల్యూట్ చేశాను. మీరూ అలాగే చేస్తారా..? లేదా అనేది నేను చెప్పలేను కానీ..మీ స్థాయిలో చప్పట్లు అయినా కొడతారని నేనకుంటున్నాను.

జవాన్:  స్కోరెంత సర్ జీ..
మేజర్:  ఈ రోజేం మ్యాచ్ ఉంది.
జవాన్: నేను మీ స్కోర్ అడుగుతున్నాను.. ఎంత మంది ప్రత్యర్ధులను చంపారు. సెంచరీ గించరీ అయ్యిందా? లేదా? ఇప్పటి వరకు
మేజర్: సెంచరీ అయితే రెండు నెలల క్రితమే అయ్యింది.
జవాన్: క్యా బాత్ హై సర్ జీ.. అయినా మీరెన్ని సెంచరీలు కొట్టిన భారతదేశ హీరోలు మాత్రం ఒకటి ధోని, రెండు షారుఖ్ ఖాన్ లే ఉంటారు. ఇక్కడ ప్రాణాలకు తెగించి పోరాడేది మనం, అయినా పేరుమాత్రం వాళ్ళదే కదా.!
మేజర్: నువ్వు చెప్పింది వాస్తవమే… ప్రతి ఒక్కరు ధోనిని కావాలి, సచిన్ టెండూల్కర్ కావాలని అనుకుంటారు, కానీ ఎవ్వరైనా నేను ఆర్మీలో చేరాలని అనుకుంటారా.?  దీని కోసం ఎమైనా చేయాలి.
జవాన్:  ఏం చేస్తారు సర్ జీ దానికోసం ఆందోళన చేస్తారా? లేక మీకొచ్చిన మెడల్ రిటర్న్ ఇస్తారా? ఇవ్వాళ రేపు అందరూ   చేస్తున్నట్టుగా..?
మేజర్: నువ్వన్నట్టు మనం ఆందోళన చేయడం స్టార్ట్ చేశామనుకో…. షారుక్ ఖాన్ కాలు బయటపెట్టలేడు, ఎగురుతున్న ధోనీ విమానం అమాంతం ఎగిరినట్టే  కిందపడిపోతోంది. సమ్మెలు ధర్నాలు మనం చేయాల్సిన పనులు కావు, మనం చేయాల్సింది దేశసేవ,శత్రు దేశాలను తిప్పికొట్టడం. అయినా ఏంటి నువ్వు హ్యాపీగా లేవా..?నీకూ అసహనం పెరిగిపోయిందా ? కోంపదీసి నీకొచ్చిన మెడల్స్ తిరిగి ఇచ్చేస్తావా? ఎంది?
(అంతలోనే తమ వైపుకు పెద్ద శబ్దంతో దూసుకొచ్చిన ప్రత్యర్థి బుల్లెట్….)
మళ్లీ ఫైరింగ్ స్టార్ట్..
మేజర్: ఓయ్…మనోళ్ళకు తెలుసో లేదో కానీ, ప్రత్యర్ధులకు తెలుసు. వాళ్ళు అసలైన హీరోలతో తలపడుతున్నామని..( ధనాధన్ బాంబులు కాల్చుతున్నాడు మేజర్….)
జవాన్:  ఏం సిక్సర్ కొట్టారు సర్ జీ…
మేజర్: హా సర్లే కానీ, నువ్వు కూడా హాఫ్ సెంచరీ కొట్టు, లేకపోతే నిన్ను దీపావళికి ఇంటికి పంపిచేది లేదు.
జవాన్:  హా..హా…హా…సర్ జీ ..మనమెప్పుడు ఇంటికి వెళితే అప్పుడే దీపావళి కదా సర్ జీ…( దడ్… దడ్… దడ్…. అంటూ కాల్పులు)

Watch Video:

 

దేశంలో అసహనం పెరిగి పోయిందని సెలెబ్రెటీలు, రాజకీయ నేతలు, రచయితలు తమ అవార్డులను వెనక్కి పంపుతూ అసహనాన్ని తెలుపుతున్నారు. గర్వించదగ్గ స్థానంలో, ఒకరికి మంచి చెడు చెప్పాల్సిన వారే దేశంలో కొత్త వివాదాలకు తెరతీస్తున్నారు.  ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ లో అన్నీ వదులుకుంటున్న  సైనికులకు లేని అసహనం ఈ సెలెబ్రెటీలకు ఎందుకు కలుగుతోంది.?

 

Comments

comments

Share this post

scroll to top