కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి, చెప్పులు కుట్టే అతనికి మధ్య జరిగిన సంభాషణ.!

కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రి స్మృతి ఇరానీ.. కొయంబత్తూర్ లో జరుగుతున్న ఇషా ఫౌండేషన్ కార్యక్రమానికి హాజరుకావడానికి వెళ్ళారు. ఈ సమయంలో ఎయిర్ పోర్ట్ లో దిగి కాస్త దూరం నడవగానే…స్మృతి ఇరానీ చెప్పు తెగిపోయింది. అయితే అప్పటికే కార్ రావడంతో ఆ తెగిన చెప్పుతో అలాగే కార్ లో ఎక్కారు మంత్రి. చెప్పు కుట్టించుకుందామని…కార్ లో వస్తూనే రోడ్డు చుట్టుపక్కల చెప్పులు కుట్టే వాళ్లెవరైనా ఉన్నారేమోనని చూసుకుంటూ వస్తున్నారు.  ఎయిర్ పోర్ట్ కు 16 కిలో మీటర్ల దూరం తర్వాత పేరూర్ అనే ఊర్లో.. ఓ చెప్పులు కుట్టే వ్యక్తి కనిపించడంతో…స్మృతి కార్ అక్కడ ఆగింది.కార్ లోంచి దిగిన స్మృతీ ఇరానీ నేరుగా చెప్పులు కుట్టే అతని దగ్గరికి వెళ్లి…తన చెప్పులను కుట్టించింది., అతను చెప్పు కుట్టే వరకు అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చొని అతనితో ముచ్చటించింది.

smriti_irani_1_1480228168

 • స్మృతీ ఇరానీ:  రోజూ ఎంత సంపాదిస్తావ్ అని అడగింది.
 • చెప్పులు కుట్టే  వ్యక్తి: 200-300 వరకు అని చెప్పాడు.
 • స్మృతీ ఇరానీ: ఎంతమంది పిల్లలు
 • చెప్పులు కుట్టే  వ్యక్తి: ఇద్దరు.
 • స్మృతీ ఇరానీ: ఏం చేస్తున్నారు వాళ్లు.
 • చెప్పులు కుట్టే  వ్యక్తి: పెళ్లిళైపోయాయ్ మేడమ్.
 • స్మృతీ ఇరానీ: ఇదేంటి…?
 • చెప్పులు కుట్టే  వ్యక్తి: అవి చెప్పులు కుట్టడానికి పనికివచ్చే లెథర్ కట్ పీస్ లు మేడమ్.( ఇదిగోండి మేడమ్..మీ చెప్పులు)

smriti_irani_2_1480228168

 • స్మృతీ ఇరానీ: ఎంతైంది?
 • చెప్పులు కుట్టే  వ్యక్తి: 10 రూపాయాలు.
 • స్మృతీ ఇరానీ: ఇదిగో ( 100 రూపాయల నోట్ ఇస్తూ…)
 • చెప్పులు కుట్టే  వ్యక్తి: చిల్లర కోసం వెతుకుతున్నాడు.
 • స్మృతీ ఇరానీ: చిల్లర వద్దు….నువ్వే ఉంచుకో..
 • చెప్పులు కుట్టే  వ్యక్తి: మేడమ్ 100/- వొద్దు, 10/- చాలు.( నిజాయితీ గా)
 • స్మృతీ ఇరానీ: లేదు లేదు ఉంచుకో….నా దగ్గర 10/- చిల్లర లేవు.
 • స్మృతీ ఇరానీ:  డబ్బు లేక పోవొచ్చు కానీ…అందినకాడికి తీసుకోవాలనే ఆలోచన కూడా ఉండదు ఆ కష్టజీవులలో… నిజాయితీయే వాళ్ల గొప్పగుణం. (పక్కనున్న వనతితో…స్మృతీ ఇరానీ.)

 

Comments

comments

Share this post

scroll to top