ఓ బ్యాంక్ మేనేజర్ కి, ఓ రిపోర్టర్ కి మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన.!

మోడీ నోట్ల రద్దు నిర్ణయం తర్వాతి రెండో రోజు….ఆ బ్యాంక్ లో చాలా రష్ గా ఉంది. చాలామంది లైన్లో నిల్చున్నారు. ఇంతలో ఓ అతను డైరెక్ట్ గా మేనేజర్ రూమ్ లోకి  వెళ్లి….ఎవరిక్కడ మేనేజర్ అంటూ గట్టిగా అరిచాడు. నేను ఏందుకు అంటూ సమాధానమిచ్చింది ఓ మహిళా మేనేజర్.  మీ వాళ్లు నన్ను పట్టించుకోవడమే లేదు, నేను చాలా సేపటినుండి వెయిట్ చేస్తున్నాను అంటూ ఆవేశంగా ఊగిపోయాడు. మీ ప్రాబ్లమ్ ఏంటి అని అడిగిన మేనేజర్ తో అతడి సంభాషణ ఈ విధంగా సాగింది.

20_rs_doctor4-copy

 • రిపోర్టర్:  నేను నా దగ్గరున్న కొన్ని పాతనోట్లను మార్చడానికి వచ్చాను, మీ సిబ్బంది నాకు సహకరించడం లేదు.
 • బ్యాంక్ మేనేజర్: చూస్తున్నారు కదా..వాళ్లంతా చాలా బిజీగా ఉన్నారు. మీ ఐడి కార్డ్ అండ్ పాత నోట్లు ఇవ్వండి నేను మీకు వాటి స్థానంలో కొత్త నోట్లు ఇస్తాను.
 • రిపోర్టర్:   ( మేనేజర్ ఆ మాట అన్నదే తడవుగా….తనవెంట తెచ్చుకున్న బ్యాగ్ లోంచి మూడు నాలుగు బండిళ్ల పాతనోట్లు ఓ 20-30 దాక వేర్వేరు ఆథార్ కార్డ్ లు తీసి మేనేజర్ టేబుల్ మీద పెట్టి.) వీళ్లంతా తమ డబ్బులు మార్చుకోవాలనుకుంటున్నారు.
 • బ్యాంక్ మేనేజర్: సరే…వీళ్లను లైన్ గా రమ్మనండి…ఒక్కొక్కరికీ పాత నోట్ల ప్లేస్ లో 4 వేల రూపాయల వరకు కొత్త నోట్లను ఇస్తాను.
 • రిపోర్టర్:  నేను —-TV రిపోర్టర్ ను, వాళ్లంతా నా బంధువులు.
 • బ్యాంక్ మేనేజర్: ఓహ్ గ్రేట్…వాళ్లను ఒక్కొక్కరిగా లైన్ లో రమ్మనండి.
 • రిపోర్టర్: ( కోపంగా)  వాళ్లు రాలేరు, వాళ్లకు ఇంటి దగ్గర చాలా పనుంది. మీరు ఆ డబ్బులేదో ఇచ్చేస్తే…నేను ఇంటికెళ్లి వాళ్లకు పంచేస్తాను.
 • బ్యాంక్ మేనేజర్: సారీ సర్…రూల్స్ ప్రకారం నేను అలా ఇవ్వలేను, పర్సన్ కి 4 వేల వరకే ఇవ్వగలను, దయచేసి అర్థం చేసుకోండి.
 • రిపోర్టర్:  మరింత కోపంగా మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, ఇప్పుడే ఓ బ్యాంక్ నుండి డబ్బులు మార్చుకొని వచ్చాను, వాళ్లెవ్వరూ ఇలా అనలేదు. మీకు మీడియా పవర్ ఏంటో తెలియనట్టుంది.
 • బ్యాంక్ మేనేజర్: సారీ సర్….30 ఆథార్ కార్డ్స్ దాక తెచ్చారు అంటే 3*4000=1,20,000/-, నేను ఇవ్వలేను.
 • రిపోర్టర్: ( కోపంగా, ఆవేశంగా బయటకెళ్లిపోయాడు, ఓ 10 నిమిషాల తర్వాత వచ్చి.) ఇప్పుడే బయటికి వెళ్లి ప్రధానమంత్రి మోడీ తో మాట్లాడి వచ్చాను, నే చెబుతుంటే నువ్వు వినట్లేవు కదా…ఆయనే డైరెక్ట్ కాల్ చేస్తా అన్నాడు.
 • బ్యాంక్ మేనేజర్:  (ఆ రిపోర్టర్ చెప్పేది అబద్దం అని అర్థమయ్యింది బ్యాంక్ మేనేజర్ కు) చెయ్యనివ్వండి, మాట్లాడుదాం.
 • రిపోర్టర్:   (ఓ 10 నిమిషాల దాకా వెయిట్ చేశాక)  మోడీ ఇప్పుడు ఇండియాలో లేరు,జపాన్ వెళ్లారు కదా… అక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా…లేకుంటే అక్కడి నుండి ఎప్పుడో ఫోన్ వచ్చేది అంటూ మెల్లిగా అక్కడి నుండి జారుకున్నాడు.

 

Comments

comments

Share this post

scroll to top