ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.! జ‌డ్జ్ కు ప్ర‌దీప్ కు మ‌ద్య జ‌రిగిన సంభాష‌ణ‌.!

ప్రదీప్ మాచిరాజు..తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు.నట్టింట్లో ఉదయం నుండి రాత్రి వరకూ ఏదో ఒక కార్యక్రమంలో ప్రేక్షకులను అలరిస్తూ మన ఇంటి కుర్రాడిగా పేరు తెచ్చుకున్నాడు..అయితే న్యూ ఇయర్ వేడుకల్లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు  దొరికిపోయాడు.అప్పటివరకు ప్రదీప్ ను తమ ఇంటి పిల్లాడుగా చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు..తర్వాత ప్రదీప్ కి జైలు శిక్ష తప్పదని,కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు కార్ అద్దాలకు ఉన్న  బ్లాక్ ఫిలిం కి కూడా శిక్ష తప్పదని రకరకాల వార్తలు వచ్చాయి…ఎట్టకేలకు ప్రదీప్ కి శిక్షపడింది..కాకపోతే కొంచెం ఊరట లభించింది అని కూడా చెప్పొచ్చు..

బ్రీత్‌ అనలైజర్‌లో సుమారు 178 పాయింట్లు చూపించడంతో.. ప్రదీప్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..ఇప్పుడు కోర్టు ప్రదీప్ కి శిక్షవిధించింది.అయితే అందరూ ఊహించినట్టుగా ప్రదీప్ కి జైలుశిక్షపడలేదు..ఈ విషయంలో ప్రదీప్ కి కొంచెం ఊరటే లభించింది.డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన తర్వాత పోలీసులు ప్రదీప్ కారును సీజ్ చేశారు.అయితే పోలీసులు నిర్వహించే కౌన్సెలింగ్‌కు ప్రదీప్‌ హాజరుకావాల్సి ఉన్నా.. కొద్ది రోజులపాటు కనబడకుండా పోయారు.అప్పుడు రకరకాల ఊహాగానాలు వినిపించాయి.అయితే కొద్దిరోజుల తర్వాత బైటికొచ్చిన ప్రదీప్ పెండింగ్ లో ఉన్న షూటింగ్స్ కంప్లీట్ చేసుకున్నా అని  తాపీగా మీడియా ముందు సమాధానం ఇచ్చారు .

కోర్టు హాల్‌లోకి వెళ్లగానే న్యాయమూర్తికి నమస్కారం చేశాడు… మీ పేరు, తండ్రి పేరు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సమాధానాలు చెప్పాడు ప్రదీప్. ‘‘మద్యం తాగి కారు నడిపారా, మీకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా?’’అని న్యాయమూర్తి అడగగా.. ప్రదీప్‌ ‘‘నాకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంది. మద్యం తాగి కారు నడిపాను..’’అని అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ… ‘‘మీరు మద్యం తాగి వాహనాలు నడపవద్దని ప్రచారం చేశారని చెబుతున్నారు.. మీరే మద్యం తాగి కారు నడపడం ఏమిటి..?’’అని ప్రశ్నించారు. దీంతో ప్రదీప్‌ న్యాయమూర్తికి నమస్కరిస్తూ.. ‘‘తప్పు జరిగింది. మళ్లీ ఇలాంటి తప్పు చేయను. నా కారుకు డ్రైవర్‌ ఉన్నారు. కానీ ఘటన జరిగిన రోజున డ్రైవర్‌ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేనే కారు నడపాల్సి వచ్చింది..’’అని వివరణ ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ప్రదీప్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను మూడేళ్లపాటు రద్దు చేయడంతోపాటు రూ.2,100 జరిమానా విధించారు..

Comments

comments

Share this post

scroll to top