కల్పనా చావ్లా తన అడ్మీషన్ కోసం కాలేజ్ ప్రిన్సిపాల్ తో మాట్లాడిన మాటలు..ఆ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్!

“నేను సాధించగలను, నాపై నాకు నమ్మకం ఉంది” అని ఓ స్టూడెంట్ తన కాలేజ్ అడ్మిషన్ రోజున తన ప్రిన్సిపాల్ ముందు కూర్చొని మాట్లాడుతోంది. తన ఇంటికి, కాలేజ్ కు ఎంతో దూరమున్నప్పటికీ ఈ కోర్సే చేయాలని ఇంతదూరంలో ఉన్న ఈ కాలేజ్ ను ఎంచుకున్నానని చెబుతుంది. దానికి ఆ కాలేజ్ ప్రిన్సిపాల్…. నీ ఆనందాన్ని, ఉత్సాహాన్ని నేనర్థం చేసుకోగలను. కానీ నీ ప్రతిభ, నువ్వు సాధించిన మెరిట్ చూస్తుంటే నీవిక్కడ ఉండటం చాలా కష్టతరం. కాబట్టి మరెక్కడైనా చేరి అక్కడ రాణించు అని సలహా ఇస్తున్నాడు.

దానికి ఆ అమ్మాయి ఎంతో వినయంగా..సార్ ఈ రంగం అంటే నాకు ఇష్టం. ఇక్కడ చదవడానికి నేను ఇష్టపడుతున్నాను, అంతకంటే ఎక్కువగా ఇది నా జీవితలక్ష్యం మరియు ఇదంటే నాకు ప్రేమ. అందుకే నేనిక్కడ చేరాలనుకుంటున్నానని చెప్పింది. కానీ ఈ కోర్సులో అమ్మాయిలకంటే అబ్బాయిలే ఎక్కువగా చేరడానికి ఇష్టపడతారని అన్నాడు ప్రిన్సిపాల్

Kalpana_Chawla_child_1

సార్ ఒక్క విషయం నాకు క్లారిటీగా చెప్పండి. నేను అమ్మాయిని అయినంత మాత్రాన నా కల నెరవేర్చుకోకూడదా?. అందరి అమ్మాయిలలాగే నన్నెందుకు సాధారణ మహిళగా చూస్తున్నారు? . ఎంత కష్టమైనా సరే నేను నా లక్ష్యాన్ని చేరుకోగలను అందుకు తగ్గ కృషి చేయగలను, సార్ దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండని ఎంతో ధీమాగా  చెప్పింది. మరోసారి అడుగుతున్న  నీ నిర్ణయం మార్చుకోవా?  ఇక్కడ ఉంటావా?  అని అడిగాడు ప్రిన్సిపాల్.
Kalpana Chawla 2
యస్..నేను ఫిక్స్ అయ్యా… నేను ఎంచుకున్న రంగంలో రయ్ అని దూసుకుపోతానన్న నమ్మకం నాకుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది ఆ అమ్మాయి .   ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసానికి ముగ్థుడైన ప్రిన్సిపల్ ఆ  కాలేజ్ ఆమె సీటును కన్ఫామ్ చేస్తూ ఇంతకీ నీ పేరు ఏంటి అని, తన అడ్మిషన్ ఫాం చూస్తూ…ఆ అమ్మాయిని అడిగాడు. మిస్ కల్పనా చావ్లా సార్ అంటూ వినయంగా సమాధానం ఇచ్చిందామె.
Kalpana-Chawla-3-1200x400
భారతదేశంలోని హర్యానాలో గల కర్నాల్ అనే గ్రామంలో పేదరిక కుటుంబంలో జన్మించిన కల్పనా చావ్లా, అంతరిక్షయానంలో మొదటి భారతీయ -అమెరికన్ మహిళ. 1997లో కల్పన అంతరిక్షయానం చేశారు. కొలంబియా వ్యోమనౌకకు జరిగిన విపత్తులో, 2003లో చనిపోయిన ఏడుగురు బృందంలో కల్పన చావ్లా ఒకరు.

Comments

comments

Share this post

scroll to top