కంచె దర్శకుడు క్రిష్ కు సూటి ప్రశ్న? కులం అనే డైలాగ్ కు క్లారిటీ కావాలి??

సందేశాత్మక చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కంచె సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది, ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ కు అపూర్వ స్పందన వస్తుంది.  ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యంగా  ట్రీట్ చేస్తున్నారు అభిమానులు… అయితే తాజాగా కంచె సినిమాలోని ఓ డైలాగ్ పై అభ్యంతరం వ్యక్తం అవుతుంది. సినిమా విడుదలకు ముందే జనాల చేత చప్పట్లు కొట్టించిన డైలాగ్ అది, సినిమాకు మంచి ఓపెనింగ్స్ ను తీసుకురావడంలో ఈ డైలాగ్   ఓ కారణం అనేది కాదనలేని సత్యం…ఇప్పుడు ఆ డైలాగ్ మీదే ఓ సూటి ప్రశ్న ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది.

ఓ సారి ఆ డైలాగ్ వినండి:  Watch Dialogue:

కులం అంటే పని.
మతాన్ని నమ్ముకున్నోడు కమ్మోడయ్యాడు,
కాపు కాసేవాడు కాపోడయ్యాడు,
కుమ్మరోడి కుండ, చాకలోడి బండ,
కంసాలి సేత,సాలీల నేత….
వాళ్లు మాత్రమే బతకడానికి కాదు.
అందరినీ బ్రతికించడానికి.
నువ్వు ఎవరూ అని అడిగితే నువ్వు ఏం చేస్తుంటావని, నీ నెత్తురేంటని కాదు.
అలా అడిగిన వాడు మనిషే కాదు.

ఇది అసలు డైలాగ్..ఇప్పుడు ఈ డైలాగ్ మీద ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్న సూటి ప్రశ్న ఏంటంటే……
Q: ఇవే పనులు (వృత్తులు) ఇతర దేశాల్లో కూడ వున్నాయి కదా మరీ అక్కడెందుకు లేవు కులాలు?

అయినా …వర్ణాశ్రమ వ్యవస్థలో… బ్రాహ్మణులు-తల నుండి, క్షత్రియులు-భుజాల నుండి, వైశ్యులు-తొడల నుండి., శూద్రులు-పాదాల నుండి పుట్టారు అని చెప్పారు కదా.. మరి ఇప్పుడు దానిని ఏమందాం…? అంటూ ఓ ప్రశ్న ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తుంది….? నిజంగానే పనిని బట్టి కులం ఏర్పడితే…విదేశాల్లో కూడా అదే ప్రతిపాదికలన కులాలు ఉండాలి కదా మరి అక్కడ ఎందుకు లేవు అన్నది పాయింటే…!

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top