టాలీవుడ్‌ను ఏలుతున్న కంటెంట్..టాలెంట్.!!

బాహుబ‌లి త‌ర్వాత తెలుగు సినిమా రేంజ్ హాలీవుడ్ స్టామినాను అందుకుంది. ఒక‌ప్పుడు సినిమా అంటే బాలీవుడ్ లేదా త‌మిళ‌నాడు వైపు చూసే వాళ్లు. ఇపుడు ఆ సీన్ మారింది. నార్త్ ప్ర‌తి విష‌యంలోను డామినేట్ చేసేంది. 19వ శ‌తాబ్ద‌మంతా బాలీవుడ్ ద‌ర్శ‌కులు, న‌టీ న‌టుల‌దే హ‌వా..20వ శ‌తాబ్ధ‌మంతా టాలీవుడ్, త‌మిళ‌నాడు హీరో హీరోయిన్లు టాప్ రేంజ్‌లోకి దూసుకు వెళ్లారు. దీనికి తోడు కోలివుడ్, మ‌ళయాళీ సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. భారీ వ‌సూళ్లు చేస్తున్నాయి.

భారీ బ‌డ్జెట్, భారీ సెట్టింగ్‌లు..డైలాగ్‌లు..పంచ్‌ల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. శంక‌ర్ , విక్ర‌మ‌న్ , మురుగ‌దాస్, పా రంజిత్ లాంటి డైరెక్ట‌ర్లు స‌క్సెస్ డైరెక్ట‌ర్లుగా ఇప్ప‌టికే పేరు సంపాదించారు. ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, విజ‌య్ , విశాల్ రెడ్డి లాంటి వాళ్లు దుమ్ము రేపుతున్నారు.

ర‌జ‌నీ 2.0 ఇటీవ‌లే రిలీజ్ అయింది. ఇవ‌న్నీ 600 నుండి 1000 కోట్ల బ‌డ్జెట్‌ను దాటేసాయి. ఇక టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే టాలెంట్ ఉన్న ద‌ర్శ‌కులు ఎంద‌రో ఈ రంగంలో త‌మ‌దైన ముద్ర వేశారు. గ‌మ్యంతో క్రిష్, తేజ , త్రివిక్రం శ్రీ‌నివాస్, బోయ‌పాటి శ్రీ‌ను, శ్రీ‌ను వైట్ల‌తో పాటు స్టార్ డైరెక్ట‌ర్లుగా కొత్త‌వారు ఈసారి దుమ్ము రేపారు. ఝాజీ సినిమాతో సంక‌ల్ప్ రెడ్డి మ‌రోసారి అంత‌రిక్షంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక క్రిష్ బాల‌కృష్ణ‌తో గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణిని తీశాడు. సురేంద‌ర్ రెడ్డి సైరాతో ముందుకొస్తున్నాడు.

బుర్రా సాయిమాధ‌వ్ మాట‌ల‌తో మంట‌లు పుట్టిస్తున్నాడు. తేజ రాణా, కాజ‌ల్‌తో క‌లిసి తీసిన సినిమా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆ సినిమాకు రాసిన డైలాగ్స్ పేలాయి. ఇక బాల‌కృష్ణ క్రిష్ కాంబినేష‌న్లో మ‌రోసారి దివంగ‌త ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా రెండు సినిమాలు క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి. ఈ సినిమాల‌కు సాయి మాధ‌వ్ మ‌రోసారి మంట‌లు రేపాడు. మాట‌ల‌కు ప్రాణం పోశాడు.

అత్తారింటికి దారేది సినిమాలో స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రం శ్రీ‌నివాస్ అద్భుత‌మైన మాట‌లు రాశాడు. ఈ డైలాగ్స్ కోసం మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీకి స‌క్సెస్ ద‌క్కింది. ఎక్క‌డ నెగ్గాలో కాదురా ఎక్క‌డ త‌గ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఈ డైలాగ్ పేలింది. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ తో తీసిన అరవింద స‌మేత మూవీలో జూనియ‌ర్ ఎన్టీఆర్ తో చెప్పించిన మాట‌లు చ‌ప్ప‌ట్లు కొట్టించాయి. సంగీతం ఎవ‌ర్ గ్రీన్ గా నిలిచింది. క్రిష్ ఎన్టీఆర్ సినిమాకు కీర‌వాణి స‌మ‌కూర్చిన సంగీతం హైలెట్.

రిలీజైన పాట‌లకు ల‌క్ష‌ల్లో వ్యూవ్స్ వ‌స్తున్నాయి. ఇక కొత్త టాలెంట్ , కంటెంట్ క‌లిగిన వారు ముందుకు వ‌చ్చారు. ఘాజీ, అంత‌రిక్షంతో మ‌రోసారి సంక‌ల్ప్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప‌రుశురాం తీసిన గీత గోవిందం 100 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసి ఓవ‌ర్సీస్, ఇండియ‌న్ , టాలీవుడ్ రికార్డుల‌ను తిర‌గ రాసింది. టాలీవుడ్‌లో టాప్ మూవీల‌ను త‌ల‌ద‌న్ని నిలబ‌డింది.

కంచె , ఫిదా సినిమాలు ఊహించ‌ని రీతిలో విజ‌యాలు న‌మోదు చేసుకున్నాయి. వంగా సందీప్ రెడ్డి తీసిన అర్జున్ రెడ్డి భారీ సినిమాల‌కు గండి కొట్టింది. ఆల్ టైం హిట్ గా నిలిచింది. కంచెర‌పాలెం నిశ్శ‌బ్ధంగా సంచ‌ల‌నం రేపింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మందాన హీరో హీరోయిన్లుగా టాప్‌లో నిలిచారు. కొర‌టాల శివ శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను సినిమాలు మ‌హేష్ బాబుకు మ‌రింత పేరు తెచ్చాయి.

వంశీ పైడిప‌ల్లితో సినిమా తీస్తున్నారు. ర‌వితేజ మూవీస్ అంత‌గా ఆడ‌లేక పోయాయి. మూస ధోర‌ణిని ఈసారి టాలివుడ్ ప్రేక్ష‌కులు ఆద‌రించ‌లేదు. సంక‌ల్ప్ రెడ్డి, ప‌రుశురాం, వంగా సందీప్ రెడ్డి లాంటి డైరక్ట‌ర్లు త‌మ కంటెంట్‌తో టాలెంట్‌తో టాలీవుడ్‌ను 30 కోట్ల రేంజ్ నుండి 100 కోట్లు దాటించారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో క‌లం బ‌లం మ‌రోసారి త‌న ప‌వ‌ర్ ఏమిటో రుచి చూపించింది. ఎవ్వ‌రి స‌హ‌కారం లేకుండానే వీరంతా త‌మ టాలెంట్‌ను న‌మ్ముకుని ..క‌ష్టాల‌ను దాటుకుని స‌క్సెస్ ఫుల్ బాట‌లో న‌డుస్తున్నారు. టాలీవుడ్ ద‌మ్మున్న ..టాలెంట్ క‌లిగిన ఆర్టిస్టులు, న‌టీన‌టులు, డైరెక్ట‌ర్లు, మాట‌ల ర‌చ‌యిత‌లు, స్క్రీన్ ప్లే, కంటెంట్ , కాపీ, పాట‌ల ర‌చ‌యిత‌ల కోసం నిరీక్షిస్తోంది. విశ్వ‌నాథ్ నుండి నేటి ప‌రుశురాం , త‌రుణ్ భాస్క‌ర్ దాకా అంతా టాలెంట్‌ను న‌మ్ముకున్నారు. రాబోయే రోజుల్లో మ‌రెన్నో విజ‌యాలు అందుకునేందుకు రెడీ అవుతున్నారు. త‌మ మెద‌ళ్ల‌కు ప‌ని పెడుతున్నారు.

మూస ధోర‌ణిని విడ‌నాడాలి. టాలెంట్ ఎవ్వ‌రి సొత్తు కాదు. కంటెంట్‌లో బ‌లం వుంటే..సినిమా అదంత‌ట అదే ఆడుతుంది. కోట్లు సంపాదించ‌డం ఇపుడు చాలా సులువు. కావాల్సింద‌ల్లా ప‌ట్టుద‌ల క‌లిగి ఉండ‌ట‌మే. అవ‌కాశాలు అపారం..చేజిక్కించు కోవ‌డ‌మే మిగిలి ఉంది. మేం ఆందోళ‌న పడ‌డం లేదు. స‌క్సెస్ వ‌స్తుందా రాదోన‌న్న ఆందోళ‌న లేదు. విజ‌యానికి ద‌గ్గ‌రి దారులు లేవు. ఉన్న‌ద‌ల్లా ఒక్క‌టే చేజిక్కించు కోవ‌డం.

Comments

comments

Share this post

scroll to top