ఆపుకోలేకపోతున్న సర్, ఇంకొన్ని రోజులు సెలవివ్వండి అని లేఖ రాసిన కానిస్టేబుల్.. వైరల్ అవుతున్న లెటర్..!!

కొంత మందికి చాలా లేట్ గా పెళ్లి అవుతుంది. ఇంట్లో వాళ్ళ పరిస్థితుల వల్లనో, లేక వ్యక్తిగత ఇబ్బందుల వలనో పెళ్లి ఆలస్యంగా చేసుకుంటారు కొందరు. అలానే కర్ణాటక కు చెందిన ఒక కానిస్టేబుల్ లేట్ గా పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి అయినా సంతోషంగా లేదు. కారణం తెలిస్తే బాధ పడాలో నవ్వాలో అర్ధమే కాదు. వివరాల్లోకెళితే…

 

పెళ్లయింది కానీ..

కర్ణాటకలోని బేగూర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు మారుతి కి ఇటీవలే వివాహం జరిగింది, వివాహం కోసమని చాలా రోజులు సెలవు తీసుకున్నాడు, వివాహం జరిగిన కొన్ని రోజులు కూడా సెలవు తీసుకున్నాడు, కానీ ఇంకా కొన్ని రోజులు సెలవు కావాలని పర్మిషన్ కోసం లెటర్ రాసాడు బాస్ కి, అందులో వివరంగా అన్ని వివరించాడు, ఈ లెటర్ కర్ణాటక అంత వైరల్ అయ్యింది, కర్ణాటక లోనే కాదు ఇండియా వ్యాప్తంగా ఈ లెటర్ వైరల్ అయ్యింది.

లెటర్ లో.. :

‘ పెళ్లి అయ్యాక కూడా సెలవులు తీసుకున్నా, కానీ సెలవులు తీసుకున్నని రోజులు బంధువులు ఇంట్లోనే ఉండటం తో ఏం చేయలేకపోయా, అవ్వక అవ్వక పెళ్లి అయ్యింది, ఆగలేకపోతున్న, అర్ధం చేసుకొని ఇంకొన్ని రోజులు సెలవు ఇవ్వండి సర్’ అంటూ లెటర్ లో పేర్కొన్నాడు మారుతి. మొదట్లో మారుతి ని చూసి పోలీస్ స్టేషన్ లో ఉన్న సహచర పోలీసులు జాలి పడ్డా, తరువాత నవ్వుకున్నారు, ఎవరో ఆ లెటర్ ని ఫోటో తీసి సోషల్ మీడియా లో పెట్టడం తో ఒక కానిస్టేబుల్ ఏ ఇలా అంటున్నాడే అని వైరల్ అయిపోయింది లెటర్. అవ్వక అవ్వక పెళ్లి అవ్వడం తో అతని ఆత్రుతని బాధని అర్ధం చేసుకొని సెలవు ఇవ్వండి సర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

 

Comments

comments

Share this post

scroll to top