ఈ రాఖి…ఉద‌యం 11 లోపే క‌ట్టాలంట‌.! వేద పండితుల వివ‌ర‌ణ‌.!!

రాఖీ పండుగ‌… అన్నా చెల్లెల్లు, అక్కా త‌మ్ముళ్ల అనుబంధానికి, ఆత్మీయత, అనురాగాల‌కు ప్ర‌తీక‌గా నిలుస్తుంది. ఆ రోజు అక్కా చెల్లెల్లు త‌మ అన్న‌ద‌మ్ముళ్ల‌కు రాఖీలు క‌డ‌తారు. త‌మ సోద‌రులు ఎల్ల‌ప్పుడూ క్షేమంగా ఉండాల‌ని, త‌మ‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌వాల‌ని వారు కోరుకుంటూ తీపి తినిపించుకుంటారు. అయితే ఈ సారి ఆగ‌స్టు 7వ తేదీన రాఖీ పండుగ వ‌స్తోంది. అదే రోజున పౌర్ణ‌మి కూడా ఉంది. కానీ.. ఆ రోజున ఉద‌యం 11 గంట‌ల లోపు రాఖీలు క‌ట్టుకోవాల‌ని పండితులు చెబుతున్నారు. ఎందుకో తెలుసా..?

ఆగ‌స్టు 7న వ‌స్తున్న రాఖీ పండుగ రోజే చంద్ర‌గ్ర‌హ‌ణం వ‌స్తుందట‌. ఆ గ్ర‌హణం రాత్రి 10.47 గంట‌ల‌కు ప్రారంభ‌మై రాత్రి 12.48 గంట‌ల‌కు ముగుస్తుంద‌ట‌. క‌నుక ఆ రోజున మ‌ధ్యాహ్నం 1.47 లోపే భోజ‌నం ముగించుకోవాల‌ట‌. ఇక రాఖీల‌ను క‌ట్టేవారు ఉద‌యం 11 గంట‌ల్లోపే ఆ కార్య‌క్రమాన్ని ముగించ‌కోవాల్సి ఉంటుంది. కొత్త‌గా జంద్యం వేసుకునే వారు ఉద‌యం 10.30 గంట‌ల్లోపే కార్య‌క్ర‌మం పూర్తి చేయాలి. అదేవిధంగా దేవాల‌యాల్లో ఉద‌యం 10.47 గంట‌ల్లోపే ధూప‌, దీప నైవేద్యాల‌ను పూర్తి చేయాలి. అనంత‌రం ఆల‌య ద్వారాలు మూసివేయాలి. భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించ‌రాదు.

ఆ రోజున ఎవ‌రైనా త‌ద్దినాలు పెట్టాల‌నుకుంటే మ‌ధ్యాహ్నం 12 గంట‌ల్లోపే ఆ తంతు ముగించాల‌ట‌. అలాగే ఈ ఏడాది ఉప‌న‌య‌నం చేసుకుంటున్న వ‌టువుల‌కు ఉపాక‌ర్మ చేయ‌డానికి వీలు లేద‌ట‌. కాగా రుగ్వేదులు భాద్ర‌ప‌ద శుద్ధ త్ర‌యోద‌శి సోమ‌వారం రోజు, య‌జుర్వేదులు భాద్ర‌ప‌ద శుద్ధ పూర్ణిమ బుధ‌వారం రోజు ఉపాక‌ర్మ ఆచ‌రించుకోవ‌చ్చున‌ట‌. రాఖీ పండుగ రోజున య‌జ్ఞోప‌వీత ధార‌ణ చేసుకునే వారు సోమ‌, మంగ‌ళ వారాల్లో రెండు సార్లు య‌జ్ఞోప‌త‌వీత ధారణ చేసుకోవాల‌ని పండితులు చెబుతున్నారు. క‌నుక రాఖీ రోజున ముఖ్యంగా రాఖీలు క‌ట్టేవారు గుర్తుంది క‌దా, ఉద‌యం 11 గంట‌ల్లోపే కార్య‌క్ర‌మాన్ని ముగించాలి..!

Comments

comments

Share this post

scroll to top