హీరో బాలకృష్ణపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు. అమ్మాయిలను కించపరిచారంటూ కంప్లైంట్.

మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ హీరో  నందమూరి బాలకృష్ణ మీద సరూర్ నగర్ PS లో పిర్యాదు చేశారు లాయర్లు. బాలయ్య మాటలు యువతను రెచ్చగొట్టేలా… ఆడవారి పై అఘాయిత్యాలకు ప్రోత్సాహించేలా  ఉన్నాయంటూ ఈ పిర్యాదులో పేర్కొన్నారు. ఓ సెలెబ్రిటిగా మహిళలను చైతన్యం చేయాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

 

కంప్లైంట్ కాపీ:

12806230_1759751654248160_8699463064478903931_n

నారారోహిత్, నందిత జంటగా నటించిన ‘సావిత్రి’ పాటల వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన బాలకృష్ణ స్టేజ్ పైకి ఎక్కి, తన ప్రసంగాన్ని మొదట బాగానే మొదలుపెట్టాడు. ఆ తర్వాత మరి కొంచెం ఫన్నీగా మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ బాలయ్య మాటలు శృతితప్పాయి. ‘అందరూ కూడా అన్ని పాత్రలలో ఇమడలేరు. నేనూ కూడా చేయలేను, కొన్ని కొన్ని పాత్రలు మాత్రమే చేయగలను, అమ్మాయిల వెంట పడమంటే ఎట్టాగయ్యా? ఊరు కుంటారా మా ఫ్యాన్స్. ఏమయ్యా ఊరుకోరుగా? వెళ్లి ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేసేయాలి అంతే. కమిట్ కమిట్ అయిపోవాలి, ఏదో ఒకటి. సో, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కో పాత్రలో ఇముడుతారని బాలయ్య అన్నారు.

Balakrishna-has-huge-sentiment-for-letter-B-tile

బాలకృష్ణ కామెంట్స్ వీడియో CLICK: HERE

Comments

comments

Share this post

scroll to top