ఆట‌గాళ్ల ఆక‌ర్ష‌క్ – రాజ‌కీయ పార్టీల టార్గెట్

ప్రపంచంలో ఎక్క‌డికి వెళ్లినా పాలిటిక్స్ భ‌లే రంజుగా ఉంటాయి. మూడు రంగాలు మాత్రం ఎప్పుడూ ఒక‌దానితో మ‌రొక‌టి పెన‌వేసుకుంటాయి. రాజ‌కీయ, సినీ , క్రీడా రంగాల‌కు చెందిన వారంతా ఏదో ఒక సంద‌ర్భంలో క‌లుసుకుంటూ వుంటారు. సొసైటీలో ఈ మూడు రంగాల‌కున్నంత క్రేజీ ఇంకే రంగానికి లేదు. ఇంకో వైపు ఈ మూడు రంగాల‌ను ఎంటర్ టైన్ మెంట్ రంగం శాసిస్తోంది. గుర్తింపు రావాల‌న్నా.కాసులు సంపాదించాల‌న్నా.రాజ‌కీయంగా ప‌ద‌వులు ద‌క్కించు కోవాల‌నుకున్నా. సినిమా రంగంలో నిల‌దొక్కు కోవాల‌నుకున్నా .క్రీడ‌ల్లో చ‌క్రం తిప్పాల‌న్నా కావాల్సింది మందీ మార్బ‌లం అక్క‌ర్లేదు ప్రింట్, మీడియా, సోష‌ల్ మాధ్య‌మ రంగాల్లో ప‌ట్టుంటే చాలు ఒక్క రోజులో సెల‌బ్రెటీ అయిపోతారు.

Azharuddin Congress

అందుకే దానికున్నంత క్రేజ్ ఇంకే దానికి లేదు. సినీ, క్రీడా దిగ్గ‌జాలుంటే వారికున్న క్రేజ్‌తో ఓట్లు రాబ‌ట్టు కోవ‌చ్చ‌ని.ఏకంగా ప‌వ‌ర్‌లోకి రావ‌చ్చ‌ని ఆయా ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు వీరిపై క‌న్నేసి వుంచాయి. 2019లో దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ప్ర‌స్తుత మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఆలోచిస్తుండ‌గా.రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ పార్టీ , దాని అనుబంధ పార్టీలు ఎలాగైనా ప‌వ‌ర్ లోకి రావాల‌ని పావులు క‌దుపుతున్నాయి.

ఈ స‌మ‌యంలో జ‌నాన్ని ఓట్ల వైపు వ‌చ్చేలా ఆక‌ర్షించేందుకు ప్ర‌ధాన పార్టీల‌న్నీ క‌లిసి సినీ, క్రీడా రంగాల‌కు చెందిన దిగ్గ‌జాల‌ను త‌మ పార్టీల‌లో చేర్చుకునేందుకు మంత‌నాలు ప్రారంభించాయి. వీరి ద్వారా ఓట్లు రాలుతాయ‌నేది వీరి ఉద్దేశం. అధికారం ఎక్క‌డుంటే అక్క‌డికి మారిపోయే ప్ర‌బుద్దులు ప్ర‌జాప్ర‌తినిదులుగా ఉండ‌డంతో ఎవ‌రు ఏ పార్టీలో ఉంటున్నారో.వెళ్లిపోయారో తెలియ‌ని ప‌రిస్థితి దేశ‌మంత‌టా విస్త‌రించి ఉంది. ఈ జాడ్యం పోవాలంటే క‌ఠినత‌ర‌మైన చ‌ట్టం ఉన్న‌ప్ప‌టికీ అది అమ‌లు కావ‌డం లేదు. దీంతో ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాత్రికి రాత్రే ఫిరాయిస్తున్నారు.

త‌మ‌కు ఎక్క‌డ కంఫ‌ర్ట్ అనుకుంటున్నారో .బి ఫారంలు ఇచ్చి ప్రోత్స‌హించిన పార్టీల‌కు చెప్ప‌కుండానే ఇత‌ర పార్టీల‌కు జంప్ అవుతున్నారు. అటు రాహుల్ గాంధీ ఇటు న‌రేంద్ర మోడీల మ‌ధ్యే ఎన్నిక‌ల పోరు సాగ‌నుంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్ర‌ధానంగా నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డ‌నున్నాయి. ఎలాగైనా ప‌వ‌ర్ లోకి రావాలంటే ఏం చేయాలో ఇప్ప‌టి నుండే ప్లాన్స్ వేయ‌డంలో మునిగి పోయారు. మోడీ, అమిత్ షా అండ్ టీం యాక్ష‌న్ ప్లాన్ పూర్తి చేసేందుకు స‌న్న‌ద్ధం అవుతుండ‌గా.రాహుల్ గాంధీ ఆయ‌న మిత్ర‌ప‌క్షాల ప‌రివార‌మంతా మోడీకి వ్య‌తిరేక శ‌క్తుల‌ను కూడ‌గ‌ట్ట‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. రాఫెల్ కుంభ‌కోణం గురించి ప్ర‌ధానంగా దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యేలా రాహుల్ జీ స‌క్సెస్ కాగ‌లిగారు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం జాతి ప్ర‌జ‌లతో ఆటాడుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాల‌ను ఎంపిక చేసే ప్ర‌క్రియ‌కు పార్టీలు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాయి. మూడు రాష్ట్రాల‌లో కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి రావ‌డం కొంచెం ఆనందం క‌లిగించినా.తెలంగాణ‌లో ఓడి పోవ‌డం రాహుల్ ను కోలుకోలేకుండా చేసింది.

పాపులారిటీ సంపాదించుకున్న వారిని ఇరు పార్టీలు టార్గెట్ చేశాయి. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ భార‌త మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ను పార్టీలోకి తీసుకుంది. ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చింది. తాజాగా టీపీసీసీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. పాపులారిటీయే పెట్టుబ‌డిగా సినీ యాక్ట‌ర్లు, స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్ పాలిటిక్స్ వైపు చూస్తున్నారు. న‌ఫీసా అలీ, కీర్తి ఆజాద్, సిద్దూ వంటి వాళ్లు పాలిటిక్స్‌లో ఉన్నారు. చాలా మంది ఆయా పార్టీల వైపు చూపు సారించారు. ఎక్కువ మంది బీజేపీని ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. సిద్దూ మొద‌ట్లో బీజేపీలో ఉన్నారు. 2014లో సీటు ఇవ్వ‌క పోవ‌డంతో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాల‌ని అనుకున్నారు.ఆ స‌మ‌యంలో బీజేపీ 2016లో రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసింది. అక్క‌డ నాలుగు నెల‌లే ఉన్నారు. కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. 2017 పంజాబ్ ఎన్నిక‌ల్లో గెలిచారు. అమ‌రీంద‌ర్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. రాజ‌వ‌ర్ద‌న్ సింగ్ రాథోడ్ మోడీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.

హాకీ మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ , కైఫ్ , భూటియాలు పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు ఆట‌గాళ్ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు పావులు క‌దుపుతున్నారు. గంగూలీ, గంబీర్, ధోనీ ని పార్టీలోకి ఆహ్వానించింది. ద్రావిడ్, కుంబ్లేల‌ను క‌ర్ణాట‌క‌లో బీజేపీ నుండి బ‌రిలోకి దింపాల‌ని య‌డ్యూర‌ప్ప ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఆయ‌న ట్ర‌య‌ల్స్ ఫ‌లించ‌లేదు. చాలా మంది ఆట‌గాళ్లు ఏ పార్టీల వైపు చూస్తారోన‌ని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. పాపులారిటీ, పైస‌లు, ప‌ద‌వులు వ‌చ్చే ఛాన్స్ ఉండ‌డంతో ఆట‌గాళ్లు పాలిటిక్స్ తో ఆడ‌డం షురూ చేశారు.

Comments

comments

Share this post

scroll to top