చిన్న‌ప్పుడు మ‌న ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో, పెద్ద‌య్యాక మ‌నం ఏవిధంగా మారుతామో తెలుసా..? ఇంట్రెస్టింగ్‌..!

నిజ‌మే మరి. చిన్న‌త‌నం అంటే అప్పుడు ఎవ‌రికైనా ఏ విష‌యం గురించీ తెలియ‌దు. అంద‌రూ ముద్దుగా చూసుకుంటారు. మురిపెంగా పెంచుతారు. గారాబంగా చూసుకుంటారు. ఆ వ‌య‌స్సులో చేసే అల్ల‌రి అయితే అంతా ఇంతా కాదు. ఇక ఆ స‌మ‌యంలో డాడీ నేన‌ది చేస్తా… మ‌మ్మీ నేను అలా అవుతా.. అంటూ ఏవేవో మాటలు మాట్లాడుతారు. కానీ యుక్త వ‌య‌స్సుకు వ‌చ్చే స‌రికి ప‌రిస్థితి తారుమారు అవుతుంది. అప్పుడు చాలా త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. అదే మ‌న భ‌విష్య‌త్తును నిర్ణ‌యిస్తుంది. త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్నామంటే.. ఇక అంతే.. అది మ‌న‌ల్ని జీవితాంతం బాధ‌పెడుతుంది. ఇక ఆ త‌రువాత దాన్ని క‌రెక్ట్ చేసుకుంటానికి కూడా వీలు కాదు. ఈ క్రమంలోనే మ‌నం చిన్న త‌నంలో పెద్దయ్యాక ఏమ‌వుదామ‌ని, ఎలా ఉందామ‌ని ఆలోచిస్తామో, వాస్త‌వ జీవితంలో పెద్ద‌య్యాక ఎలా జ‌రుగుతుందో ఇప్పుడు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చూద్దాం.

చిన్న‌త‌నంలో- నేను పెద్ద‌య్యాక ఇండియ‌న్ క్రికెట్ టీంలో ఆడ‌తా, దేశానికి వ‌ర‌ల్డ్ క‌ప్ తెచ్చి పెడ‌తా
పెద్ద‌య్యాక – ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రోజు సెలవు దొరికితే బాగుండు

చిన్న‌త‌నంలో – నేను పెద్ద‌య్యాక ఆర్మీలో చేరి ఏలియ‌న్స్‌ను చంపుతా
పెద్ద‌య్యాక – ప్లే స్టేష‌న్ కొనేందుకు డ‌బ్బు పొదుపు చేయాలి

చిన్న‌త‌నంలో – పెద్ద‌య్యాక నేను, నా ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఉంటా, అప్పుడు నాపై ఎవ‌రూ అర‌వ‌రు
పెద్ద‌య్యాక – సెల‌వులు ఎక్కువ దొరికితే అమ్మా, నాన్న‌ల‌ను చూసేందుకు వెళ్తా

చిన్న‌త‌నంలో – పెద్ద‌య్యాక ధూమ్ సినిమాలో ఉన్న బైక్‌పై నేను వ‌ర‌ల్డ్ టూర్ వేస్తా
పెద్ద‌య్యాక – ఊబ‌ర్ చార్జిలు పెరుగుతున్నాయ్‌, మెట్రో లో వెళ్ల‌క త‌ప్ప‌దేమో

చిన్న‌త‌నంలో – పెద్ద‌య్యాక నేను అంద‌మైన అత‌న్ని/ఆమెను పెళ్లి చేసుకుంటా
పెద్ద‌య్యాక – ఫ‌ర్లేదులే, అందంలో ఏముంది, స‌ర్దుకుందాం

చిన్న‌త‌నంలో – స్కూల్ పాస‌య్యాక మంచి కాలేజీలో చ‌దివి మంచి కంపెనీలో ఉద్యోగం సాధిస్తా
పెద్ద‌య్యాక – ఛ‌, స్కూల్ రోజులు మ‌ళ్లీ వ‌స్తే బాగుండు, చ‌క్క‌గా చ‌దువుకోవ‌చ్చు

చిన్న‌త‌నంలో – నేను వ్యోమ‌గామినై అంత‌రిక్షంలోకి వెళ్తా
పెద్ద‌య్యాక – అబ్బో, ఇంట‌ర్‌స్టెల్లార్ సినిమా చూశాం క‌దా, అంత‌రిక్షంలో కొంచెం క‌ష్ట‌మే

చిన్న‌త‌నంలో – చాకొలేట్ తో చేసిన ఇంట్లో ఉంటూ రోజూ కోలా ఫౌంట‌న్‌లో గ‌డుపుతా
పెద్ద‌య్యాక – గాంధీ జ‌యంతి రోజు బ్లాక్‌లో ఎవ‌రైనా మద్యం అమ్మితే బాగుండు

చిన్న‌త‌నంలో – నాకు 25 ఏళ్లు వ‌చ్చాక నేను బిల్‌గేట్స్ క‌న్నా ధ‌న‌వంతున్ని అవుతా
పెద్ద‌య్యాక – నెల నెలా ఇంటి అద్దె ఇస్తే చాలు, సగం బాధ తీరిపోయిన‌ట్టే

చిన్న‌త‌నంలో – డ‌క్ టేల్స్‌లో అంకుల్ స్క్రూజ్ కార్టూన్ క్యారెక్ట‌ర్‌లా నేను బాగా ధ‌నం సంపాదించి రిచ్ అవుతా
పెద్ద‌య్యాక – ఆఫీస్‌కు లేటుగా వెళ్తే శాల‌రీ క‌ట్ చేయ‌కుంటే చాలు

చిన్న‌త‌నంలో – ఏదో ఒక రోజు ప్ర‌పంచం మొత్తం టూర్ వేస్తా
పెద్ద‌య్యాక – ఏదో ఒక రోజు ఆఫీసుకు ఓలా ప్రైమ్‌లో వెళ్తా

చిన్న‌త‌నంలో – నేను పెద్ద‌య్యాక ప్ర‌పంచాన్ని మార్చేస్తా
పెద్ద‌య్యాక – రేపు ఆటో చార్జిలో చిల్ల‌ర దొరికితే బాగుండు

చిన్న‌త‌నంలో – ఏదైనా ఒక రోజు ఒక ఐలాండ్ కొని అందులో భ‌వంతి క‌డ‌తా
పెద్ద‌య్యాక – రూ.10వేల లోపు అద్దెకు ఇల్లు దొరికితే బాగుండు

చిన్న‌త‌నంలో – పెద్ద‌య్యాక నాకు హాలిడేస్ వ‌రుస పెట్టి వ‌స్తాయ్
పెద్ద‌య్యాక – వీకెండ్స్‌లో హాఫ్ దొరికితే చాలు

చిన్న‌త‌నంలో – పెద్ద‌య్యాక మంచి ఖ‌రీదైన‌ పిజ్జాలు తింటా
పెద్ద‌య్యాక – తినేందుకు ఏది దొరికినా చాలు

చిన్న‌త‌నంలో – పెద్ద‌య్యాక నేను శ‌క్తిమాన్ అయి ప్ర‌పంచాన్ని ర‌క్షిస్తా
పెద్ద‌య్యాక – వీకెండ్స్‌లో పని ఉండ‌క‌పోతే చాలు

Comments

comments

Share this post

scroll to top