దయచేసి మా విశ్వాసాలను గెలకొద్దు… మా దేవతామూర్తులు బొమ్మలు మీ బికినీలా మీదెందుకు? బలుపు కాకపోతే?

మేమంతే….చెట్టును పూజిస్తాం…పుట్టను పూజిస్తాం…మట్టిపరిమళాన్ని సైతం పూజిస్తాం. మా నమ్మకం మాది. మా సాంప్రదాయం మాది..మా ఆచారం మాది. కానీ ఫ్యాషన్ పేరుతో మా ఆత్మగౌరవాన్ని , మా నమ్మకాలను,  విశ్వాసాలను… దెబ్బతీయాలనే చూసే వారందరికీ ఒక్కటే విజ్ఞప్తి…మానుకోండి.. మా విశ్వాసాలను కించ పరిచి సొమ్ము చేసుకోవాలనుకునే మీ ఆలోచనను విరమించుకోండి. సహనానికి మారుపేరుగా ఉన్న మా దేశీయులమంతా..కన్నెర్ర చేయకముందే …మీ చీప్ బిజినెస్ ట్రిక్ లను మానుకోండి.

LAKSHMI-SWIMSUIT

 

అయినా మీరేంటి…?  అండర్ వేర్ల మీద, చెప్పుల మీద….ప్రింట్ వేయడానికి  .. ప్రపంచం మొత్తం మీద వేరే ప్రింటింగ్స్ యే లెనట్టు… సిరులిచ్చే మా లక్ష్మీ దేవిని, విఘ్నాలను తొలగించే మా గణనాథుడిని అలా వాడుకుంటున్నారు.? ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో స్వాతంత్య్రానికి పూర్వం ఎలాగైతే వ్యాపారం చేసుకున్నారో…అంతకు మించిన వ్యాపారం ఆన్ లైన్ పేరుతో ఇప్పుడు చేసుకుంటున్నారు.. అప్పుడూ ఇప్పుడూ.. మిమ్మల్ని మేం అడ్డుకోలేదు…. అప్పుడేమో మా సాంప్రదాయాలను మాకు కాకుండా చేసి పాశ్చాత్య భావాలను నింపి పోయారు ఎంతగా అంటే మా పిచ్చి జనాలు ఇప్పటికీ  జనవరి ఫస్ట్ ను పండగలా చేసుకునేంతగా..! ఇప్పుడేమో… మా దేవతా మూర్తుల బొమ్మలను  బికినీల మీద, చెప్పుల మీద, అండర్ వేర్ ల మీద ప్రింట్ చేస్తూ మమ్మల్ని అవమాన పరుస్తున్నారు.

1284657931_hindu goddess on shoes

గతంలోనే…ఓ మోడల్ లక్ష్మీ దేవి బొమ్మ ప్రింట్ గల బికినీ  వేసుకొని మమ్మల్ని హర్ట్ చేసింది . మళ్లీ చెప్పుల మీద వినాయకుడి బొమ్మను వేసి అవమాన పరిచారు. ఇప్పుడు మళ్లీ అండర్ వేర్ ల మీద అలాగే చేసి కించపరచాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు…. మీకు సెంటిమెంట్ లు, గౌరవమర్యాదలు ఉండకపొవొచ్చు….కానీ మాకున్నాయ్… దేవతామూర్తులను మేమెంతగా పూజిస్తామో…అదేవిధంగా   గాంధీ అంటే కూడా అలాగే ఆరాధిస్తాం. మాకు మేలు చేసిన ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుట్టాం..అలాంటిది మీరు బికినీల మీద, చెప్పల మీద, అండర్ వేర్ల మీద..వేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోమంటారు.

లచచ

ఫ్రెండ్స్…దీనిపై మననుండే స్పందన రావాలి….. మన దేవతామూర్తుల బొమ్మలను అడ్డగోలుగా ప్రింట్ చేసే కంపెనీల ప్రొడక్ట్స్ కొనకుండా ఉందాం… అప్పుడు కానీ వారు మన దారికి రారు.

1

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top