నోట్ల రద్దుపై ఓ 18 మంది అనుభవాలు ఇవి, ఓ సారి వినండి.!!

common-man-problems-1

నేనో కూర‌గాయల వ్యాపారిని. రూ.500 నోట్లు తీసుకుంటున్నా. కాక‌పోతే రూ.450 విలువ చేసే కూర‌గాయ‌లు కొంటేనే చిల్ల‌ర ఇస్తున్నా.
– బ‌లరాం

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహ‌న‌దారుల‌కు చ‌లాన్లు వేద్దామంటే వారు అన్నీ రూ.500, రూ.1000 నోట్లే ఇస్తున్నారు. దీంతో గత్యంత‌రం లేక వారికి కోర్టు చ‌లాన్లు వేస్తున్నాం. వారు ఆ మొత్తాన్ని కోర్టులో చెల్లిస్తున్నారు.
– ట్రాఫిక్ పోలీసులు

నా ద‌గ్గ‌ర అన్నీ రూ.500, రూ.1000 నోట్లే ఉన్నాయి. వాటిని తీసుకోవ‌డం లేదు. దీంతో నాకు ప‌నిచ్చిన బిల్డ‌ర్ వ‌ద్ద రూ.200 అప్పు తీసుకున్నా. వాటితోనే ఇంట్లోకి కావ‌ల్సిన సామాను కొన్నా. ఇంకా నా ద‌గ్గ‌ర రూ.80 ఉన్నాయి. అవి ఎన్ని రోజులు వ‌స్తాయో చూడాలి.
– మ‌హేష్‌, కార్మికుడు

నాకు చ‌దువు రాదు. నోట్ల ర‌ద్దు గురించి నాకేమీ తెలియ‌దు. దాని గురించి నాకు ఎవ‌రైనా పూర్తిగా చెబుతార‌ని చూస్తున్నా.
– తారా దేవి

నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. ఐడీ ప్రూఫ్ అంత‌కంటే లేదు. నా ద‌గ్గ‌ర రూ.2వేలు ఉన్నాయి. వాటిని ఎలా మార్చుకోవాలి..?
– ఘ‌న్‌శ్యాం, కూలీ.

నోట్ల ర‌ద్దుతో నా వ్యాపారం పూర్తిగా డీలా ప‌డిపోయింది. ఉద‌యం నుంచి అర‌టి పండ్ల‌ను అమ్ముతున్నా వాటిని కొనేవారు లేరు. ఒక‌రిద్ద‌రు వ‌చ్చారు, కానీ వారు రూ.500 నోట్ల‌ను తెచ్చారు. అదీ చిల్ల‌ర కోసం. నేనివ్వ‌లేన‌ని చెప్పా.
– బషీర్.

హోల్‌సేల్ వ్యాపారులు స‌రుకు అమ్మ‌డం లేదు. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వారు మాత్రం చిల్ల‌ర కావాల‌ని పెద్ద నోట్లు ఇస్తూ బెదిరిస్తున్నారు.
– రంజిత్‌, కిరాణా షాపు య‌జ‌మాని.

నాకు ఐడీ ప్రూఫ్ లేదు. బ్యాంక్ అకౌంట్ ఉంది. అయితే ఇక్క‌డ లేదు. మా సొంత ఊర్లో ఉంది. మా బంధువుల‌కు బ్యాంక్ పాస్‌బుక్ తెమ్మ‌ని చెప్పా. అది వ‌స్తేనే బ్యాంక్‌లో డ‌బ్బులు వేయ‌గ‌ల‌ను. డ్రా చేసుకోగ‌ల‌ను. అప్ప‌టి వ‌ర‌కు ప‌స్తే.
– క‌మ‌ల

మొన్నా మ‌ధ్య నా మేక‌ను అమ్మా. రూ.5వేలు వ‌చ్చాయి. అన్నీ రూ.500, రూ.1000 నోట్లే. వాటిని ఎవ‌రూ తీసుకోవ‌డం లేదు. నా ద‌గ్గ‌రేమో తిండికి వేరే డ‌బ్బులు లేవు. ఇంకో మేక‌ను క‌ట్ చేస్తేనే నాకు ఆహారం ల‌భిస్తుంది.
– ప‌ప్పు

నా ద‌గ్గ‌ర రూ.5వేలు ఉన్నాయి. అన్నీ రూ.500 నోట్లే. డిష్ టీవీ రిచార్జికి, ఫోన్ రిచార్జికి చిల్ల‌ర కావాలంటున్నారు. దుకాణ‌దారులు క‌మిష‌న్ ప‌ద్ధ‌తిలో ఆ నోట్ల‌ను మారుస్తామ‌ని అంటున్నారు.
– విక్కీ

పెట్రోల్ బంక్‌లలో రూ.500 నోట్ల‌ను తీసుకోవ‌డం లేదు. ప్ర‌భుత్వం దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాలి
– రింకు

మెడిక‌ల్ షాపుల వారు రూ.500 నోట్ల‌ను తీసుకోవ‌డం లేదు. కానీ మెడిసిన్‌ను అప్పు కింద ఇస్తామంటున్నారు.
– గోపాల్‌, కూలీ.

నా ద‌గ్గ‌ర ఉన్న సిలిండ‌ర్‌లో గ్యాస్ అయిపోయింది. దాన్ని నింపాలంటే చిల్ల‌ర అడుగుతున్నారు. రూ.500 నోట్ల‌ను తీసుకోవ‌డం లేదు. నాకు ఆహారం ఎలా వ‌స్తుందో చూడాలి.
– సునీల్

నాకు యాక్సిడెంట్ అయి దెబ్బ‌లు త‌గిలాయి. మెడిసిన్ కోసం వెళ్తే రూ.230 చిల్ల‌ర కావాలంటున్నారు. నా ద‌గ్గ‌ర పెద్ద నోట్లే ఉన్నాయి. ఏం చేయాలో తెలియ‌డం లేదు.
– మ‌హ‌మ్మ‌ద్ జ‌నీఫ్

నా షాపుకు వ‌చ్చే అంద‌రూ చిల్ల‌ర కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వారిని తాకిడిని త‌ట్టుకోలేక షాప్ మూసేశా.
– ఖేమ్‌రాజ్‌, కిరాణా షాపు య‌జ‌మాని.

నోట్ల‌ను మార్చుకుందామంటే ఐడీ ప్రూఫ్ ద‌గ్గ‌ర లేదు. ఆధార్ కార్డు మా సొంత ఊర్లో ఉంది. నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. డ‌బ్బుల‌న్నీ ఎలా మార్చుకోవాలి..?
– పింటు, కూలీ

నా ఫ్రెండ్స్ నా ద‌గ్గ‌ర ఉన్న రూ.100 నోట్ల‌ను ఇవ్వ‌మ‌ని బ‌ల‌వంత పెడుతున్నారు. ఇవ్వాలా వద్దా..? నాకూ కావాలి క‌దా..!
– సురేష్

నా ద‌గ్గ‌ర రూ.9వేలు ఉన్నాయి. అన్నీ బ్యాంక్‌లోనే ఉన్నాయి. డ్రా చేద్దామంటే పెద్ద లైన్ ఉంది. ఏటీఎంలు ప‌నిచేయ‌డం లేదు. తిండి కోసం చాలా క‌ష్ట‌మ‌వుతోంది.
– అమ‌ర్‌సింగ్‌, టెంపో క్లీన‌ర్‌.

కేవ‌లం పైన చెప్పిన వారే కాదు, నోట్ల ర‌ద్దు వ‌ల్ల దేశంలో చాలా మంది ప్ర‌జ‌లు దాదాపుగా ఇలాంటి అవ‌స్థ‌ల‌నే ఎదుర్కొంటున్నారు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల సంగ‌తి అటుంచితే గ్రామాల్లో నోట్ల ర‌ద్దు ప‌ట్ల చాలా ఆందోళ‌న నెల‌కొంది. త‌మ నోట్ల‌ను ఎలా మార్చుకోవాలో, ఎంత వ‌ర‌కు లిమిట్ ఉందో, ఎంత వ‌ర‌కు డ్రా చేసుకోవ‌చ్చోన‌ని చాలా మంది గ్రామ‌స్తుల‌కు తెలియ‌డం లేదు. దీంతో వారికి ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. స‌ద‌రు గ్రామీణుల‌కు నోట్ల ర‌ద్దుపై అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైనే కాదు, విద్యావంతుల‌పై కూడా ఉంది.

common-man-problems

రూ.500, రూ.1000 నోట్ల చెలామ‌ణీపై ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వం గ‌డువు పొడిగించింది. దీంతో ప్ర‌జ‌లు ఆయా నోట్ల‌తో పెట్రోల్ బంకులు, హాస్పిట‌ల్స్ వంటి వాటిలో చెల్లింపులు చేయ‌వ‌చ్చు. కానీ దేశంలో చాలా వ‌ర‌కు పెట్రోల్ బంకులు, హాస్పిట‌ల్స్‌లో ఆ నోట్ల‌ను తీసుకోవ‌డం లేదు. ఇది ప్ర‌జ‌ల‌కు మ‌రింత విసుగును తెప్పిస్తోంది. కొన్ని చోట్లైతే ఈ నోట్ల ప‌ట్ల వాగ్వివాదాలు, బెదిరింపులు కూడా చోటు చేసుకుంటున్నాయి. బీహార్‌లో రేప్‌కు గురైన త‌న 3 ఏళ్ల చిన్నారిని హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్తే అక్క‌డ రూ.500 నోట్ల‌ను తీసుకోలేదు. దీంతో స‌ద‌రు బాధిత కుటుంబం రూ.100 నోట్ల‌ను తెచ్చే సరికి 3 గంట‌లు ఆల‌స్యంగా ఆ చిన్నారికి వైద్యం అందింది.

ఇంకో చోట 55 ఏళ్ల వృద్ధురాలు పొలం అమ్మ‌గా త‌న‌కు వ‌చ్చిన డ‌బ్బులు చెల్ల‌వ‌ని తేల‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంది. బ్యాంకుల ద్వారా రోజుకు రూ.4వేల క‌న్నా ఎక్కువ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఓ వ్య‌క్తి త‌న కూతురు పెళ్లి ఉంద‌ని, శుభ‌లేఖ‌ను చూపిస్తూ రూ.4వేల క‌న్నా ఎక్కువ ఇవ్వాల‌ని బ్యాంక్ అధికారులను కోరాడు. అయిన‌ప్ప‌టికీ వారు రూల్స్ మాట్లాడారు. దీంతో ఆ వ్య‌క్తి చేసేది లేక వెనుదిరిగాడు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు నిత్యం ఇప్పుడు ఎక్క‌డ చూసినా స‌హ‌జ‌మై పోయాయి. మ‌రి ప్ర‌జ‌ల బాధ‌లు తీరి వారికి స‌రిప‌డా క‌రెన్సీ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుందో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top