విద్యుత్ బ‌ల్బ్ నుండి కాంతి ఎలా వస్తుంది ?

ఎలక్ట్రిక్ స్థంభాలకుకట్టిన తీగలగుండా విద్యుత్ ప్రవహించినపుడు కాంతి,ఉష్ణం వెలువడతాయన్న సిద్ధాంతం ఆధారంగా ఎలక్ట్రిక్ బల్పు తయారైంది.నిజానికి ఈ లైట్ విద్యుత్తును ఉష్ణంగానూ,కాంతిగాను మారుస్తుంది.ఇటువంటి కాంతి సాధనాలను ఇన్ కాండీ సేంట్ లాంప్స్ అంటారు.వీటి బల్బ్ లల్లో చుట్టగా చుట్టిన టంగ్ స్ట‌న్ ఫిలమెంట్ గాజు దీపంలో సీల్ వేయడం జరుగుతుంది. ఫిలమెంట్ రెండు కొనలను దళసరి వైరుకు జత చేయబడి ఉంటుంది. ఆ రెండు వైరులు గాజు గొట్టం ద్వారా వెలుపలికి వస్తాయి. ఆ తరువాత గాజు బుడ్డిలోని గాలిని వెలుపలికి తీసి,దానిలో నైట్రోజన్,ఆర్గాన్ వాయువులను నింపడం వల్ల ఫిలమెంట్ ఉష్ణోగ్రత వలన కరిగిపోకుండా ఉంటుంది.

వెలుపలికి వచ్చిన తీగలు రెండు కలవకుండా ఉండటానికి ప్లాస్టిక్ లేదా లక్క లాంటి పదార్దాన్ని క్యాప్ లో నింపుతారు. విద్యుచ్ఛక్తి ఫిలమెంట్ ద్వారా ప్రవహించినపుడు తీగ ముందు ఎర్రగా మారి,వేడెక్కి తెల్లబడుతుంది. ఈ ఫిలమెంట్ వల్లనే కాంతి వెలువడుతుంది.

Comments

comments

Share this post

scroll to top