ఏ రంగు వ‌ల్ల ఏం లాభం క‌లుగుతుందో తెలుసా?

రంగుల లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించగలమా..ఒక్కసారి ఊహించి చూడండి..ఊహించుకోవడానికే చాలా కష్టం ఉంది కదా..అంతలా మన జీవితంలో మమేకమైపోయాయి రంగులు.. వ్యక్తి యొక్క మనోభావాలు మరియు ప్రవర్తనలపై ప్రభావాన్ని కలిగి ఉండడమే కాక, మన రోజువారి కార్యకలాపాలు మరియు ప్రతిస్పందనలను కూడా ప్రభావితం చేస్తాయి. పసుపు రంగు సంతోషకరమైన మూడ్ కారణమైతే…ఎరుపు రంగు హృదయ స్పందన మరియు శ్వాస ప్రేరేపిస్తుంది….అదేవిధంగా ఇతర రంగులు ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోండి..

పింక్..ఆడపిల్లలకు చాలా ఇష్టమైన రంగు… పింక్ రంగుకు ఆందోళన మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించే శక్తి ఉంది…ఎవరిపైనైనా కోపంగా ఉన్నప్పుడో…లేదంటే కోపాన్ని అనుచుకోలేక గొడవ పడే స్థాయికి వెళ్లినప్పుడు పింక్ కలర్ ను చూసి మీ మూడ్ ను మార్చుకోవచ్చు..

ఆరెంజ్

మీరేదైనా ఎగ్జామ్ కి లేదంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నారా…నెర్వస్ ఫీల్ అవుతున్నారా..అయితే ఖచ్చితంగా మీకు ఆరెంజ్ హెల్ప్ చేస్తుంది..ఆరెంజ్ కలర్ మనలో ఉన్న మెంటల్ ఎబిలిటీని పెంచుతుంది..అలాగే మన మైండ్ షార్ప్ గా పనిచేసేలా హెల్ప్ చేస్తుంది..ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవడం వలన డిస్టర్బ్ గా ఉన్న మీ మూడ్ ను మారుస్తుంది.

గ్రీన్ కలర్…

ఆఫీస్ లో పని ఒత్తిడిగా ఉందా..ఏ పని కూడా సాఫీగా చేసుకోలేకపోతున్నారా…అయితే మీ చుట్టుపక్కల ఆకుపచ్చ రంగు ఉండేలా చూసుకోండి..ఎప్పుడైనా గమనించారా పచ్చని ప్రకృతిని చూడగానే మన మనసు పరవశంతో ఉప్పోంగిపోతింది..మైండ్ లో ఉన్న టెన్షన్ అంతా ఎగిరిపోయిన ఫీలింగ్ కలుగుతుంది..ఇది అంతే..

తెలుపు..

శాంతికి చిహ్నం తెలుపు రంగు..వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తాం..ఎండవేడిమి నుండి మనల్ని రక్షించడానికి తెలుపు రంగు బట్టలు మనకెంతో హెల్ప్ చేస్తాయి అంతే కాదు మన మనసుని ప్రశాంతంగా ఉంచడంలో కూడా తెలుపు రంగు సాయపడ్తుంది.

నలుపు

నలుపు రంగును అశుభంగా భావిస్తారు…పండుగలు,పేరంటాలప్పుడు నలుపు రంగు నివాడని వారు ఉన్నారు..కానీ నలుపు మీలో పట్టుదలను ,ఏదన్నా సాధించాలనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను పెంచుతుంది..మనం అశుభంగా భావించే నలుపు రంగే ఫ్యాషన్ ప్రపంచంలో రారాజు..

నీలం

బ్లూ కి ఆకలిని తగ్గించే శక్తి ఉంది..దీనికి కారణం నీలం రంగును చూడగానే మన మెదడు విడుదల చేసే కొన్ని రసాయనాలు..కాబట్టి బరువు పెరిగిపోతున్నాం అని బాదపడేవాళ్లు మీ డైనింగ్ హాల్ ని బ్లూ కలర్ లో మార్చుకోండి..

పసుపు

మెదడు సెరటోనిన్ అనే కెమికల్ ను విడుదల చేయడంలో సహాయపడ్తుంది పసుపురంగు..దీనివలన సంతోషకరమైన మూడ్ సొంతమవడమే కాదు..నాడీవ్యవస్థను మేల్కోలుపతుంది., అనేక ఆహార ఉత్పాదక సంస్థలు వినియోగదారులను ఆకర్షించడానికి పసుపు రంగును ఉపయోగిస్తాయి.

ఎరుపు

ఎరుపు రంగు అత్యంత శక్తివంతమైన, అడ్రినల్ గ్రంథి మరియు న్యూరాన్స్ ప్రేరేపిస్తుంది. మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ని ప్రభావితం చేస్తుంది…మీరు దేన్నైనా సమర్ధంగా ఎదుర్కోనేలా చేస్తుంది.

Comments

comments

Share this post

scroll to top